మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు నిర్వహించిన కేబినేట్ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రులకు చెప్పారు. మంత్రి వర్గం నుంచి తప్పించినంత మాత్రాన వారిని పక్కన పెట్టినట్టు కాదన్నారు. వారు పార్టీకి పని చెయ్యాలని సూచించారు. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్‌చార్జ్ గా బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు.
ఎన్నికల్లో గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనని కూడా అన్నారు. చాలా మంది మంత్రి పదవికి పోటీలో ఉన్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంత మంది పదవిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయిని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే సీఎం తెలిపారు. ఆరు నెలల క్రితమే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని భావించినా జరగలేదు. ఇప్పుడు సీఎం వ్యాఖ్యలతో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఖాయమని తేలిపోయింది.