ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జడ్జిలపై ఆరోపణలతో సీఎం లేఖ రాయడం, బహిర్గతం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ పిటిషన్లలో గందరగోళం నెలకొందని.. వీటికి విచారణ అర్హత లేదంటూ ఆ కేసులను కొట్టివేశారు.
జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. అమరావతి భూములపై గ్యాగ్ సుప్రీంకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసిన తర్వాత పిటిషన్లపై విచారణ ఎందుకని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలా? వద్దా.. అనేది సీజేఐ పరిధిలోని అంశం. సీఎం పదవి నుంచి తొలగించాలన్న అభ్యర్థనకు విచారణ అర్హత లేదు. లేఖలోని అంశాలను ఇప్పటికే వేరే బెంచ్ పరిశీలిస్తోందని వ్యాఖ్యానించారు. లేఖ బహిర్గతంపై దురుద్దేశం ఉన్నందున చర్యలు తీసుకోవాలన్న పిటిషినర్ మణి కోరారు. జగన్ లేఖపై అంతర్గత విచారణ చేయాలని కూడా జీఎస్ మణి కోరారు. లేఖ రాసి బహిర్గతం చేశాక విచారణ జరపాల్సిన అవసరమేంటని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు.
సుప్రీం జడ్జిపై సీఎం జగన్ వ్యాఖ్యల పిటిషన్‍ను మరో పిటిషన్‍తో జత చేస్తామంటూ దమ్మాలపాటికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‍తో జతచేసింది సుప్రీంకోర్టు. ఈ పిటిషన్ జనవరి చివరివారంలో విచారణకు రానుంది. సీఎం జగన్ చర్యలు స్వతంత్ర న్యాయవ్యవస్థకు ముప్పు కలిగేలా ఉన్నాయన్న మణి వాదనకు పిటిషనర్ అభ్యర్థనలు గందరగోళంగా ఉన్నాయని జస్టిస్ కౌల్ వ్యాఖ్యానించారు. రెండో అభ్యర్థన న్యాయపరంగా చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జగన్ ఆరోపణల అంశాలు ఇప్పటికే వేరే ధర్మాసనంలో ఉన్నాయన్న జస్టిస్ కౌల్.