వైఎస్సార్ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఆమె అతి త్వరలోనే ప్రజల్లో మంచి పేరు దక్కించుకోవడం కోసం పాదయాత్రను మార్గంగా ఎంచుకున్నారు. అందుకోసం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను ఆమె చేసేందుకు సిద్దం అయ్యారు. రేపటి నుండి ప్రారంభం కాబోతున్న పాద యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. షర్మిల పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాదయాత్ర లో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు గాను సిద్దం అయ్యారు.
రేపు ఉదయం 11 గంటలకు చేవెళ్ల లో బహిరంగ సభ నిర్వహించి షర్మిల తన పాద యాత్రను మొదలు పెట్టబోతుంది. వైఎస్సార్ కూడా గతంలో చేవెళ్ల నుండి తన పాదయాత్రను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. షర్మిల పాదయాత్ర ఏకంగా 400 రోజుల పాటు సాగబోతుంది. రాష్ట్రం మొత్తంలో ఆమె నాలుగు వేల కిలో మీటర్ల మేరకు పాదయాత్ర ద్వారా చుట్టేయనున్నారు. షర్మిల పాదయాత్ర కోసం భారీ ఎత్తున ఖర్చు చేసి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.