Advertisement

అయ్యప్పన్ డబుల్ రీమేక్ అంట

Posted : March 27, 2020 at 2:16 pm IST by ManaTeluguMovies

మలయాళ సినిమా అయ్యప్పన్ కోషియమ్ వార్తలు తెగ హడావుడి చేస్తున్నాయి. నిజానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఆ సినిమా రేటు ఇంకా ఫైనల్ చేయలేదు. దాన్ని కోనేందుకు పెద్దగా కాంపిటీషన్ లేదు. తిరుపతి ప్రసాద్ లాంటి నిర్మాతలు చూసి, తెలుగుకు నప్పదు అని పెదవి విరచి వదిలేసారు. ప్రేమమ్ అప్పుడు ఇలాగే అన్నారు, చేసి చూపించాం, ఇదీ చేసి చూపిస్తాం అనే ఆలోచనలో వున్నారు నిర్మాత నాగవంశీ.

అయితే తెలుగు రైట్స్ మాత్రమే కాకుండా హిందీ రైట్స్ కూడా కలిపి బేరం చేస్తున్నారని బోగట్టా. తెలుగుకే కోటి రూపాయలకు పైగా చెబుతున్నారని తెలుస్తోంది. అలా కాకుండా తెలుగు, హిందీ కలిపి బేరం చేస్తున్నారని తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఇంతవరకు బాలయ్య ఈ సినిమా చూడలేదు. ఆయన చూసి, చేస్తానంటేనే ఓకె లేదూ అంటే వృధా అవుతుంది. హీరోయిన్ లేకుండా, గ్లామర్ లేకుండా, పెద్దగా ఫైట్లు లేకుండా డ్రయ్ గా, కేవలం ఎమోషన్ తో వుండే ఈ క్యారెక్టర్ అంటే బాలయ్య ఓకె అంటారా? అన్నది అనుమానం. బాలయ్య ఓకె అనడంతో సరిపోదు. సరిజోడీ అయిన మరో హీరో కావాలి. రానా అయితే బాగుంటుందని వుంది. కానీ రానా ఇప్పటికే చాలా అసైన్ మెంట్లు ఒప్పేసుకున్నారు. అవన్నీ పూర్తి చేయాల్సి వుంది. అందుకే మంచు విష్ణు పేరు కూడా వినిపించింది.

ముందుగానే మంచు విష్ణు పేరు పైకి వస్తే, రానా నో అంటాడని, తమ ఆప్షన్ రానా మాత్రమే అని సితార యూనిట్ చెబుతోంది. రానా దొరక్కపోతే, బాలయ్య తో చేయడానికి మిగిలిన ఆప్షన్ మంచు విష్ణునే. మొత్తం మీద టాలీవుడ్ లో ఏ హడావుడి లేకున్నా అయ్యప్పన్న కోషియమ్ హడావుడి మాత్రం ఎక్కువే వుంది. ఎందుకనో? చిత్రంగా, ఆ సినిమా చూసిన టాలీవుడ్ జనాలు అందరూ మాత్రం అది తెలుగుకు సెట్ అవ్వదనే అంటున్నారు.


Advertisement

Recent Random Post:

High Tension on YS Jagan Tirumala Visit | Laddu Controversy | Bhumana

Posted : September 27, 2024 at 2:16 pm IST by ManaTeluguMovies

High Tension on YS Jagan Tirumala Visit | Laddu Controversy | Bhumana

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad