Advertisement

ఆస్కార్​ బరిలో ఊహించని సినిమా

Posted : September 27, 2023 at 8:19 pm IST by ManaTeluguMovies

ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద సెన్సేష‌నల్‌ కలెక్షన్స్​​ సాధించిన మలయాళ సినిమా 2018. టోవినో థామస్‌, అపర్ణ బాల మురళి, కుంజకో బోబ‌న్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. తాజాగా ఆస్కార్‌ 2024 అవార్డుల కోసం భారత్‌ నుంచి అధికారికంగా ఎంపికైంది.

వచ్చే ఏడాది ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల కోసం బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఈ 2018 చిత్రాన్ని సెలెక్ట్ చేశారు. జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ‘2018లో కేరళలో సంభవించిన వరదలు ఎంతటి విధ్వంసం సృష్టించాయో తెలిసిన విషయమే. దాని ఆధారంగానే ప్రతి ఒక్కరూ హీరోనే అంటూ ఈ సినిమాను ఎంతో నేచురల్​గా తెరకెక్కించారు.

ఈ చిత్రం ఆద్యంతం భావోద్వేగ భరితంగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మొదట ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదల చేయగా మంచి హిట్​ అందుకుంది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్​తో ఇతర భాషల్లో కూడా రిలీజ్​ చేయగా.. బాక్సాఫీస్ వద్ద రూ.100కోట్లకుపైగా వసూళ్లను సాధించడంతో పాటు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. ప్రస్తుతం ఈ 2018 చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్​ ఫామ్​ సోనీలివ్‌లో మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ప్రతి ఏడాది ఎన్నో దేశాలు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో తమ చిత్రాలను ఆస్కార్​ అకాడమీకి అధికారికంగా పంపు తుంటాయి. అలా ఈ సారి ఆస్కార్‌ 2024 అధికారిక ఎంట్రీ కోసం భారత్​ నుంచి చాలానే చిత్రాలు గట్టిగానే పోటీ పడ్డాయి. ఫిల్మ్‌ మేకర్‌ గిరీశ్ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ.. చెన్నై వేదికగా ఈ పోటీ పడ్డ చిత్రాలను వీక్షించింది. మొత్తం 22 సినిమాలను కమిటీ వీక్షించింది.

ఇందులో ఫైనల్​గా బెస్ట్ ఇంటర్నేషనల్​ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో 2018 సినిమాను సెలెక్ట్ చేసింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్​ ఆమిర్‌ ఖాన్‌ లాగాన్‌ చిత్రం తర్వాత ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌ బరిలో తుది వరకు నిలబడలేదు. అంతకు ముందు మదర్ఇండియా , సలామ్‌ బాంబే సినిమాలే ఈ విభాగంలో పోటీ పడ్డాయి. ఇకపోతే రాజమౌళి RRR ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డును ముద్దాడిన సంగతి తెలిసిందే.


Advertisement

Recent Random Post:

నీటిపై తేలియాడే విమానం! | Vijayawada-Srisailam Sea Plane Trial Run Conducted Successfully

Posted : November 8, 2024 at 9:59 pm IST by ManaTeluguMovies

నీటిపై తేలియాడే విమానం! | Vijayawada-Srisailam Sea Plane Trial Run Conducted Successfully

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad