Advertisement

ఆస్కార్స్‌కు 7 సినిమాలు పంపిన తొలి భారతీయ నటుడు?

Posted : July 19, 2024 at 5:59 pm IST by ManaTeluguMovies

భారతదేశంలోని లెజెండ‌రీ న‌టుల్లో కమల్ హాసన్ ఒకరు. చలనచిత్ర పరిశ్రమకు తన బహుముఖ ప్రజ్ఞతో విశిష్ఠ సేవ‌లందిస్తున్న ఈ నటుడు తన కెరీర్‌లో అనేక అవార్డులు, నామినేషన్లను అందుకున్నాడు. అతడు స్వయంగా ఆస్కార్ (అకాడెమీ అవార్డు)కి నామినేట్ కానప్పటికీ, అతడు న‌టించిన చాలా చిత్రాలు ఆస్కార్ నామినేష‌న్ల కోసం పోటీప‌డ్డాయి. ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో పరిశీలనకు నోచుకున్నాయి. కమల్ హాసన్ న‌టించిన ఏడు సినిమాల‌ను ఆస్కార్ రేసులోకి పంపారు. క‌మల్ వ్యక్తిగతంగా ఆస్కార్ నామినేషన్‌ను అందుకోలేదు.

ఆస్కార్ నామినేషన్‌లకు పంపిన వాటిలో 5 తమిళ చిత్రాలు, రెండు హిందీ చిత్రాలు ఉన్నాయి. కానీ అంతిమంగా ఆస్కార్స్ తుది జాబితాలో చేరలేకపోయాయి. మణిరత్నం దర్శకత్వం వహించిన నాయకన్‌లో కమల్ హాసన్, శరణ్య, నాసర్, ఢిల్లీ గణేష్ తదితరులు నటించారు. ఈ చిత్రం బొంబాయి అండర్ వరల్డ్ డాన్ వరదరాజన్ ముదలియార్ జీవిత‌క‌థ‌ ఆధారంగా రూపొందింది. ఇది అమెరికన్ చిత్రం ది గాడ్ ఫాదర్ నుండి ప్రేరణ పొంది రూపొందించారు. క‌మ‌ల్ హాస‌న్ కెరీర్ లో అత్యుత్త‌మ చిత్రాల‌లో ఇది ఒక‌టిగా నిలిచింది.

1992లో విడుదలైన ఈ చిత్రానికి భరతన్ దర్శకత్వం వహించారు. ఇందులో కమల్ హాసన్, నాసర్, శివాజీ గణేశన్, గౌతమి, రేవతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమల్ హాసన్ విజయవంతమైన చిత్రాలలో ఇది ఒకటి. రెండు గ్రామాలను విడదీసే కుల పోరు, ప్రజల మధ్య ఉన్న అనైక్యతను అరికట్టడానికి ఒక కుటుంబం తమ సర్వస్వాన్ని ఎలా త్యాగం చేస్తుందనే దానిపై ఈ చిత్రం తెర‌కెక్కింది.

పీసీ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, నాజర్, అర్జున్, గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 1995లో విడుదలైంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్. ఇది తమిళ చిత్రసీమలో ఒక కల్ట్ హోదాను పొందింది. ప్రధానంగా హింస, తీవ్రవాదం నేప‌థ్యంలో అద్భుత‌మైన స్క్రీన్ ప్లేతో మంచి పేరొచ్చింది.

2000లో విడుదలైన ఈ చిత్రానికి కమల్ హాసన్ దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, రాణి ముఖర్జీ, షారూఖ్ ఖాన్ మరియు వసుంధర దాస్ నటించిన పీరియాడికల్ క్రైమ్ డ్రామా. ఈ చిత్రం తమిళం, హిందీ రెండింటిలోనూ విడుదలైంది. వాణిజ్యపరంగా విజయం సాధించనప్పటికీ ప్రత్యామ్నాయ భారతీయ చరిత్రను విజయవంతంగా చిత్రీకరించినందుకు ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. వీటితో పాటు మ‌రో రెండు హిందీ చిత్రాలు ఉన్నాయి. క‌మ‌ల్ హాస‌న్ ఆస్కార్ రేంజు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఆస్కార్స్ రావాలంటే కేవ‌లం ప్ర‌తిభ ఉంటే స‌ర‌పోదు.

పెట్టుబ‌డి కూడా చాలా అవ‌స‌రం అని నిరూప‌ణ అయింది. భ‌విష్య‌త్ లో సౌతిండియా నుంచి కూడా ఆస్కార్ పోటీలో రాణించే సినిమాలు వ‌స్తున్నాయ‌న్న భ‌రోసా ఇప్పుడు ఉంది. త‌మ సినిమాల‌ను హాలీవుడ్ లో భారీగా ప్ర‌మోట్ చేయ‌డం ద్వారా, పెద్ద పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా వ‌చ్చే గుర్తింపు, వోటింగ్ తో కూడా ఆస్కార్ లు గెల‌వ‌డం అన్న‌ది ముడిప‌డి ఉంది. ఆస్కార్ ల కోసం మ‌నం వెళ్ల‌డం కాదు.. మ‌న‌మే ఆస్కార్ ల‌ను మించేలా అవార్డులివ్వాలి అని విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ గ‌తంలోనే అన్నారు. క‌ల్కి 2989 ఏడిలో ప‌రిమిత పాత్ర‌తోనే ఆస్కార్ రేంజ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ర‌క్తి క‌ట్టించాడు. పార్ట్ 2లో విశ్వ‌రూపం చూపించ‌బోతున్నాడు. అయినా ఆస్కార్ లు అత‌డికి అవ‌స‌రం లేదు. ఆస్కార్‌ల‌కే అత‌డు కావాలి!


Advertisement

Recent Random Post:

భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా కుట్రలు | India-China dispute | Full & Final

Posted : September 12, 2024 at 10:46 pm IST by ManaTeluguMovies

భారత్‌లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా కుట్రలు | India-China dispute | Full & Final

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad