Advertisement

టిల్లు క్యూబ్ లో ఆమెతో మరో ట్విస్ట్

Posted : May 29, 2024 at 8:24 pm IST by ManaTeluguMovies

రాధిక.. ఈ రోల్ ను టాలీవుడ్ సినీ ప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు మూవీలోని ఆ రోల్ కు అంతా ఫిదా అయిపోయారు. హీరోయిన్ నేహా శెట్టి.. ఆ పాత్రలో తన అందం, అభినయంతో తనదైన శైలిలో మెప్పించింది. మూవీ రిలీజ్ అయ్యి రెండేళ్లు అయినా రాధిక పాత్రకు ఏ మాత్రం కూడా క్రేజ్ తగ్గలేదు. ఇక రీసెంట్ గా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ లో కూడా నేహా శెట్టి సందడి చేసింది.

కొన్ని నిమిషాలే రాధిక సిల్వర్ స్క్రీన్ పై కనపడినా.. థియేటర్లలో ఆడియన్స్ విజిల్స్ తో హోరెత్తించారు. అయితే టిల్లు ఫ్రాంచైజ్ లో ఫస్ట్ రెండు పార్టులు హిట్ కావడంతో మేకర్స్.. మూడో భాగం టిల్లు క్యూబ్ ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూ లో మూవీ కాన్సెప్ట్ కూడా మారుతున్నట్లు సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు.

అయితే తొలి రెండు పార్టుల్లో అలరించిన నేహా శెట్టి.. థర్డ్ పార్ట్ లో ఉంటుందా లేదా అన్న విషయంపై ఆమె లేటెస్ట్ గా స్పందించింది. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ తో టిల్లు క్యూబ్ పై అంచనాలు పెంచేసింది. టిల్లు స్క్వేర్‌ మూవీలో రాధిక బెంగళూరు వెళ్లినట్లు చూపించారు కదా అని నేహ గుర్తు చేసింది. అక్కడకు వెళ్లాక ఆమె వేరే మ్యారేజ్ చేసుకుంటుందా లేదా మళ్ళీ వస్తుందా అనేది చెప్పలేమని అనింది. దీంతో టిల్లు క్యూబ్ లో కూడా రాధిక రోల్ ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే రాధిక రోల్ ను మేకర్స్ ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే చేస్తారని చెప్పింది నేహా శెట్టి. డైరెక్టర్స్ తనకు ఇచ్చిన డైలాగులు ఎంత బాగా చెప్పగలననే విషయంపై ఎప్పుడూ ఆలోచిస్తానని తెలిపింది. టిల్లు చిత్రాల్లోని రాధిక రోల్.. ప్రస్తుత జనరేషన్ కు పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పింది. బెదురులంక మూవీ తో తాను చేసిన చిత్ర పాత్ర కూడా అలాగే ఉంటుందని తెలిపింది. దీంతో పాటు తన అప్ కమింగ్ మూవీ గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి కోసం కూడా మాట్లాడింది.

గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రంలో తాను బుజ్జి అనే స్ట్రాంగ్ రోల్ చేసినట్లు చెప్పింది నేహా శెట్టి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలిసిన అమ్మాయి పాత్రలో కనిపించనున్నానని తెలిపింది. తన రోల్ అందరికీ నచ్చుతుందని వెల్లడించింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ మూవీ.. మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నేహా శెట్టి ఎలాంటి హిట్ అందుకుంటుందో వేచి చూడాలి.


Advertisement

Recent Random Post:

“Varahi Declaration” by Sri Pawan Kalyan in Tirupati | Public Meeting | Sanatana Dharma Raksha Board

Posted : October 3, 2024 at 6:57 pm IST by ManaTeluguMovies

“Varahi Declaration” by Sri Pawan Kalyan in Tirupati | Public Meeting | Sanatana Dharma Raksha Board

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad