Advertisement

‘నిన్న కమెడియన్ గా పెట్టుంటే..’ హరీష్ గట్టి కౌంటర్

Posted : June 19, 2024 at 7:06 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’ అనే ఫేమస్ డైలాగ్ గుర్తుందా? ఈ డైలాగ్ పవన్ కోసం రాశారు కానీ.. హరీష్ శంకర్ కు కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఆయనకు ఎవరైనా హర్ట్ చేస్తే గట్టిగా కౌంటర్లు ఇస్తుంటారు. తన మనసులోని మాటలను బహిరంగంగానే వేదికలపై బయటపెడుతుంటారు. ఇప్పటికే ఇలా చాలా సార్లు జరిగిన విషయం తెలిసిందే.

కొన్ని రోజుల క్రితం రవితేజ ఈగల్ మూవీ సక్సెస్ మీట్ కు గెస్ట్ గా వచ్చిన ఆయన.. తన గత సినిమాలను టార్గెట్ చేసిన వాళ్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారి సంగతి చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అభిమాన హీరో చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా అంటూ సైగలు చేశారు. ఆ తర్వాత రీసెంట్ గా తనపై కామెంట్స్ చేసిన సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడుకు బహిరంగ లేఖ రాసి కౌంటర్ ఇచ్చారు. కానీ ఇటీవల వారిద్దరు కలిసిపోయినట్లు ఉన్నారు.

ప్రస్తుతం ఆయన రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ రీసెంట్ గా షో రీల్ పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు. హరీష్ శంకర్ మార్క్, రవితేజ మాస్ యాక్షన్ తో షో రీల్ అదిరిపోయింది. మంచి రెస్పాన్స్ అందుకుంది. అదే సమయంలో ఓ కోలీవుడ్ క్రిటిక్.. మూవీ గురించి వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీంతో హరీష్ శంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

షో రీల్ లోని స్క్రీన్ షాట్స్ తీసిన ఆ క్రిటిక్.. రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే పిక్స్ ను పోస్ట్ చేశాడు. రవితేజ హీరోయిన్ సెలక్షన్.. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కన్నా బాగుంటుందనే ఉద్దేశంతో రాసుకొచ్చాడు. దీంతో హరీష్ శంకర్ మండిపడ్డారు. సదరు క్రిటిక్ పోస్ట్ ను రీషేర్ చేసి ఎక్స్ లో ఇచ్చిపడేశారు. ‘నిన్న కమెడియన్ పెట్టి ఉంటే బాగుండేది.. అయినా సరే నువ్వు మమ్మల్ని నవ్వించావు.. కాబట్టి ప్లీజ్ కంటిన్యూ చెయ్.. ఇంకా ఆశిస్తున్నా’ అని పోస్ట్ చేశారు.

ఇంకా విడుదల చేయని సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు హరీష్ శంకర్. ఆ తర్వాత సదరు క్రిటిక్ ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్.. కూడా కల్కి 2898 ఏడీ మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేసిన క్రిటిక్ పై ఫుల్ ఫైర్ అయ్యారు. 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీసి చూపించాలని సోషల్ మీడియాలో సవాల్ విసిరారు.


Advertisement

Recent Random Post:

YS Sharmila Fires On CM Chandrababu, Dy CM Pawana Kalyan And YS Jagan

Posted : September 27, 2024 at 6:07 pm IST by ManaTeluguMovies

YS Sharmila Fires On CM Chandrababu, Dy CM Pawana Kalyan And YS Jagan | Ntv

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad