Advertisement

పాలిటిక్స్ పాట ఎత్తుకున్న గీతూ.. ఆ పార్టీ అయితే పక్కా అంటోంది!

Posted : December 31, 2022 at 12:42 pm IST by ManaTeluguMovies

సోషల్ మీడియాతో పాపులర్ అయిన గీతూ రాయల్ బిగ్ బాస్ 6లో కూడా పాల్గొంది. అయితే ఆమె జబర్దస్త్‌లో పలు ఎపిసోడ్స్‌లోనూ నవ్వించింది. కాగా, ఆమె బిగ్‌బాస్‌లో తనదైన గేమ్‌తో ఆడియెన్స్‌ను మెప్పించింది. ఇక బిగ్ బాస్ నుంచి ఆమెను సడెన్‌గా ఎలిమినేట్ చేయడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

కాగా, ఇప్పుడు పలు షోలలో ఆమె పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో గీతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. గీతూ రాజకీయ ఎంట్రీపై చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తనకు రాజకీయాలు అంటే ఇష్టమున్నా, ఇప్పటివరకు ఎలాంటి పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ చేయలేదని.. అయితే తాను భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడం ఖాయమని గీతూ చెప్పుకొచ్చింది.

ప్రజలకు సేవ చేసే పార్టీలో తాను ఖచ్చితంగా చేరుతానని.. తనకు ప్రజాసేవ చేయాలని ఉందంటూ గీతూ కామెంట్ చేసింది. దీంతో గీతూ పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతోంది. బిగ్ బాస్ నుంచి మరింత ఫేం తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


Advertisement

Recent Random Post:

Ambati Rambabu మాటలకు పడి పడి నవ్వుకున్న CM చంద్రబాబు

Posted : June 28, 2024 at 5:37 pm IST by ManaTeluguMovies

Ambati Rambabu మాటలకు పడి పడి నవ్వుకున్న CM చంద్రబాబు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement