Advertisement

పెగ్గేస్తుంటే RGV ఏమిటయా ఈ జూమింగు?

Posted : March 10, 2022 at 11:32 am IST by ManaTeluguMovies

ఏదో ఒక గడబిడ సృష్టించి తనకు కావాల్సిన ప్రచారం చేసుకుంటారు ఆర్జీవీ. గత కొంతకాలంగా లేడీ బ్రూస్ లీ వీరంగం అంటూ వరుసగా తన కథానాయిక పూజా బాలేకర్ బికినీ ఫోటోలు జిమ్మింగ్ ఫోటోలను వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేస్తున్నారు.

దీనికి యూత్ హీటెక్కిపోతున్నారు. ఈ సినిమాని ఇండియాతో పాటు చైనాలో కూడా విడుదల చేస్తామని అంటున్నారు. కానీ ఏది నిజమో నమ్మలేని పరిస్థితి. ఇప్పటివరకూ ఈ మూవీ విడుదల కాలేదు.

మరోవైపు ఆర్జీవీ జూమిన్ లెన్స్ ఒక రేంజులో ప్రకోపిస్తోంది. ఇదిగో సర్కారీ.. తనతో కలిసి డ్రింక్ పుచ్చుకున్నానని ఎంతో బోల్డ్ గా బాహాటంగా ఫోటో ఆధారంతో బయటపెట్టేసారు ఆర్జీవీ. ఆ కెమెరా యాంగిల్ ఆ రేంజులో వర్కవుటైంది. వోడ్కా మూడో పెగ్గు వేశాక.. ఆర్జీవీ నేటపై పడి పొర్లి మరీ ఈ షాట్ తీసారు.. అంటూ ఒక అభిమాని కామెంట్ చేసారు. మొత్తానికి పెగ్గు వేసాక కూడా ఆర్జీవీ బ్రెయిన్ సునామీలా పని చేస్తోందనేందుకు ఇది ఒక ఎగ్జాంపుల్.

మావా నీకున్న సుఖం లోకంలో ఎవరికైనా దొరుకునా?

ఇటీవలి కాలంలో ఆర్జీవీ విలాసం చూస్తుంటే కుళ్లుకోని వారు ఎవరైనా ఉంటారా? ఇటీవలి కాలంలో టీవీ యాంకర్లను బిగ్ బాస్ స్టార్లను సినీతారలుగా మలిచే పనిలో ఉన్న ఆర్జీవీ వారికి కావాల్సినంత పబ్లిసిటీని ఇస్తున్నారు. బోల్డ్ యూట్యూబ్ ఇంటర్వ్యూలతో వెబ్ లో మంటలు పుట్టిస్తున్నారు ఆర్జీవీ.

`అంతా నా ఇష్టం` అన్న చందంగా ఆయన చేస్తున్న బోల్డ్ ఇంటర్వ్యూలు వెబ్ లో దడ పుట్టిస్తున్నాయి. ఇంతకుముందు అరియానా.. నిన్న గాక మొన్న అషు రెడ్డి బోల్డ్ ఇంటర్వ్యూలు వెబ్ ని షేక్ చేశాయి. బిగ్ బాస్ బ్యూటీలతో కలిసి ఆర్జీవీ పబ్బులో పార్టీలు హడావుడి తెలిసిందే.

అరియానా – అషు రెడ్డి లతో బోల్డ్ ఆర్జీవీ సందడి ఒక రేంజులో సాగింది. అప్పట్లోనే ఒక అభిమాని.. “మావా నీకు ఉన్న సుఖం లోకంలో ఎవరికి అయినా దొరుకుతుందా చెప్పు“ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా బోయ్స్ నుంచి బోలెడన్ని బోల్డ్ కామెంట్లు పడిపోయాయ్.

అయితే ఇప్పుడిలా ఛార్మితో కలిసి పెగ్గు వేయడంపైనా ఆర్జీవీ జాలీ లైఫ్ సెలబ్రేషన్ విషయంలో బోయ్స్ అంతా కుళ్లుకుపోతున్నారు. అదంతా సరే కానీ.. తన డీకంపెనీ సినిమాల్ని రిలీజ్ చేయకుండా ఇంకా ఎన్నాళ్లని ఇలా? అంటూ కొందరు యూత్ ప్రశ్నల్ని కురిపిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

ఓటేశాక సీఎం జగన్ ఏం చెప్పాడో చూడండి.. | YS Jagan | YS Bharathi

Posted : May 13, 2024 at 2:28 pm IST by ManaTeluguMovies

ఓటేశాక సీఎం జగన్ ఏం చెప్పాడో చూడండి.. | YS Jagan | YS Bharathi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement