Advertisement

ప్ర‌భాస్…తార‌క్ లా చ‌ర‌ణ్ ఎందుకు చేయ‌లేక‌పోతున్నాడు!

Posted : May 8, 2024 at 9:22 pm IST by ManaTeluguMovies

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మొత్తం కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసింది కేవ‌లం రెండు సార్లు మాత్రమే చోటు చేసుకుంది. 2013 లో `నాయ‌క్`..`తుఫాన్` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఆ త‌ర్వాత మ‌రుస‌టి సంవత్స‌ర‌మే `ఎవ‌డు`..`గోవిందుడు అంద‌రివాడే` చిత్రాలు రిలీజ్ తో అభిమానుల ముందు కొచ్చారు. ఆ త‌ర్వాత చ‌ర‌ణ్ ఒకే ఏడాది రెండు రిలీజ్ ల జోలికి వెళ్లింది లేదు. ఏడాదికే ఒక సినిమానే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇలా ఏడాదికి ఒక సినిమా చేస్తే ప‌న‌వ్వ‌దు.

అత‌డు కూడా డార్లింగ్ ప్ర‌భాస్..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లా జోరు పెంచాలంటూ అభిప్రాయ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. `ఆర్ ఆర్ ఆర్` త‌ర్వాత `గేమ్ ఛేంజ‌ర్` తోనే చ‌ర‌ణ్ టైంపాస్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే బుచ్చిబాబు తో త‌న 16వ చిత్రం..సుకుమార్ తో 17వ చిత్రం ప్రారంభించారు. కానీ అవి ఇంకా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కాలేదు. జూన్ నుంచి 16వ చిత్రం ఆన్ సెట్స్ కి వెళ్తుంది అంటున్నారు. కానీ అందులో క్లారిటీ లేదు. మ‌రోవైపు గేమ్ ఛేంజ‌ర్ షూటింగ్ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చిందో కూడా క్లారిటీ లేదు.

అయితే చ‌ర‌ణ్ ఇలా నెమ్మ‌దిగా సినిమాలు చేయ‌డంపై విమ‌ర్శ కూడా వ్య‌క్త‌మ‌వుతుంది. మిగతా హీరోల్లా అత డెందుకు ప్లాన్ చేసుకోలేక‌పోతున్నాడు? అని ప్ర‌ధానంగా వినిపిస్తోంది. ప్ర‌భాస్ ఒకేసారి రెండు..మూడు షూటింగ్ ల‌కు హాజ‌ర‌వుతున్నాడు. తార‌క్ కూడా `దేవ‌ర‌`తో పాటు `వార్ -2` లో జాయిన్ అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి రోజుకి మూడు షిప్టులు ప‌నిచేసిన న‌టుడు. ఒకే ఏడాది మూడు..నాలుగు రిలీజ్ చేసిన సంద‌ర్భాలున్నాయి.

కంబ్యాక్ త‌ర్వాత కూడా ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసిన రికార్డు ఆ సీనియ‌ర్ కి ఉంది. మ‌రి చ‌ర‌ణ్ అలా ఎందుకు ప్లాన్ చేసుకోలేక‌పోతున్నారు? ప్రాజెక్ట్ లు క‌మిట్ అవ్వ‌డంలో…రిలీజ్ చేయ‌డంలో జాప్యం దేనికంటూ? సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తంలో ఇదే త‌ర‌హా విమ‌ర్శ‌లు యంగ్ టైగ‌ర్ కూడా ఎదుర్కున్నారు. దేవ‌ర చిత్రాన్ని ప‌ట్టాలెక్కించ‌డం డిలే అయ్యే స‌రికి అత‌డు తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కున్నవారే.


Advertisement

Recent Random Post:

Death toll at Hajj pilgrimage rises to 1300 amid extreme high temperatures

Posted : June 24, 2024 at 12:36 pm IST by ManaTeluguMovies

Death toll at Hajj pilgrimage rises to 1300 amid extreme high temperatures

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement