Advertisement

ప్రేమలు మమితా ‘ప్రయణ విలాసం’ టాక్ ఏంటి..?

Posted : May 4, 2024 at 7:52 pm IST by ManaTeluguMovies

రీసెంట్ గా యూత్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుని వారి మనసులు దోచేసిన భామ మమితా బైజు. గిరీష్ AD డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రేమలు సినిమాలో నెల్సన్ లీడ్ రోల్ లో నటించగా మమితా బైజు ఫిమేల్ లీడ్ గా చేసింది. సినిమా చూసిన వారంతా కూడా మమితా బైజు తో ప్రేమలో పడిపోతారు. ప్రస్తుతం సౌత్ ఆడియన్స్ అందరికీ ఆమె క్రష్ గా నిలిచింది. ఎంట్రీ ఇచ్చి 8 ఏళ్లు అవుతున్నా కూడా ప్రేమలు తోనే ఆమె సూపర్ పాపులర్ అయ్యింది. ప్రేమలు సినిమా తెలుగులో కూడా ప్రేక్షకాదరణ లభించింది. ఈ సినిమా తో తెలుగులో మమితాకు మంచి ఫాలోయింగ్ వచ్చింది.

మమితా క్రేజ్ ని క్యాష్ చేసుకునే క్రమంలో ఆమె నటించిన సినిమాలను తెలుగులో అనువదిస్తున్నారు. ఈ క్రమంలో లాస్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రణయ విలాసం సినిమాను అదే టైటిల్ తో తెలుగులో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశారు. నిఖిల్ మురళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అర్జున్ అశోకన్, అనస్వర రాజన్, మమితా బైజు, మియా జార్జ్ నటించారు. ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన ఈ ప్రణయ విలాసం కథ ఏంటంటే.. చిన్ననాటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టపడే సూరజ్ (అర్జున్‌ అశోకన్‌)అదే తన ఫ్యూచర్ అనుకుంటూ జీవిస్తుంటాడు. దాని కోసం తగిన టైనింగ్ తీసుకోవాలని అనుకుంటాడు.

మనోజ్ తండ్రి రాజీవన్‌ (మనోజ్‌ కె.యు)కి ఇది ఏమాత్రం నచ్చదు. ఇక ఇదిలా ఉంటే మనోజ్ డిగ్రీలో చేరగా అక్కడ గోపిక (మమితా బైజు)తో పరిచయం ప్రేమగా మారుతుంది. ఓ పక్క ఇది జరుగుతుంటే మరోపక్క మనోజ్ తండ్రి రాజీవన్ కాలేజ్ డేస్ లో ప్రేమించిన మీరా(మియా జార్జ్‌) జీవితంలోకి వస్తుంది. అదే టైం లో భార్య అనుశ్రీ (శ్రీధన్య) అనారోగ్యంతో మృతిచెందుతుంది. అనుశ్రీ రాసుకున్న డైరీ చదివిన రాజీవన్ షాక్ కు గురవుతాడు. పెళ్లికి ముందు ఆమెకు కూడా ప్రేమకథ ఉంటుంది. ఆ తర్వాత ఆ డైరీ సూరజ్ చదువుతాదు. ఆమె చివరి కోరిక తీర్చాలని అనుకుంటాడు. ఇంతకీ సూరజ్ మదర్ కోరిక ఏంటి..? సూరజ్ దాన్ని నెరవేర్చాడా..? సూరజ్ గోపికల ప్రేమకథ సుఖాంతమైందా అన్నది ప్రణయ విలాసం కథ.

మలయాళ పరిశ్రమలో కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తుంటారని మరోసారి ఈ ప్రణయ విలాసం చూస్తే అర్ధమవుతుంది. హీరో హీరోయిన్ ప్రేమ కథ చెప్పడం కాదు వారి తల్లిదండ్రుల ప్రేమ కథ అది కూడా తండ్రి మరొకరితో.. తల్లి పెళ్లికి ముందు మరో వ్యక్తిని ప్రేమించడం లాంటి కథ రాయడమే గొప్ప ఆలోచన. ప్రణయ విలాసం నిఖిల్ కథ పరంగా సూపర్ అనిపించాడు. సెన్సిబుల్, లవ్ స్టోరీస్ నచ్చే వారికి ఇది నచ్చేస్తుంది. అయితే కథనం కొన్ని చోట్ల రొటీన్ గా అనిపిస్తుంది.

ఐతే ఈ కథలో హీరో, హీరోయిన్ పాత్రలు కేవలం ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ తప్ప మిగతా అంతా కూడా పేరెంట్స్ స్టోరీనే ఉంటుంది. మమితా బైజు క్రేజ్ తో ఈ సినిమా చూడాలని అనుకున్నా కొత్త కథ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. థియేటర్ కు వెళ్లి చూడటం అంటే బడ్జెట్ గురించి ఆలోచించొచ్చు కానీ ఓటీటీ రిలీజ్ కాబట్టి ఈ సినిమా ఎక్కువమంది చూసే అవకాశం ఉంది. ప్రణయ విలాసం ఒక మంచి సినిమాగా ప్రేక్షకులను మెప్పిస్తుంది.


Advertisement

Recent Random Post:

హైడ్రా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు | Notices to Hydra Commissioner Ranganath

Posted : September 27, 2024 at 7:05 pm IST by ManaTeluguMovies

హైడ్రా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు | Notices to Hydra Commissioner Ranganath

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad