బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇంకా ఆలియా భట్లు ప్రేమలో ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెల్సిందే. వీరిద్దరి ప్రేమ వ్యవహారంపై బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో అనూహ్యంగా కొన్ని విషయాలను సాక్ష్యాలుగా చూపిస్తూ ఆలియా గత కొన్ని రోజులుగా రణబీర్ కపూర్‌కు దూరంగా ఉంటుందని, వీరిద్దరి మద్య బ్రేకప్ అయ్యిందనే ప్రచారం మొదలైంది.
ఆలియా భట్, రణబీర్ కపూర్ల బ్రేకప్ వార్తలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే మూడు నాలుగు బ్రేకప్‌లు అయిన రణబీర్ కపూర్ మరోసారి తన ప్రేమకు బ్రేకప్ పడేలా చేసుకున్నాడా అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఆలియా భట్ తమ ప్రేమ విషయమై స్పందించింది. మీడియాలో వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఆలియా స్పందించింది.
మీ బ్రేకప్ గురించి చెప్పండి అంటూ ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా అవన్నీ చెత్త పుకార్లు అంటూ కొట్టి పారేసింది. ప్రస్తుతం రణబీర్ కపూర్ ఆయన కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఆయన తండ్రి రిషి కపూర్ అనారోగ్యం నుండి కోలుకుంటున్న ఈ సమయంలో తండ్రి ఇంకా తల్లితో రణబీర్ కపూర్ టైం స్పెండ్ చేస్తున్నాడు. అంతే తప్ప మీమిద్దరం విడిపోలేదు. మేము మునుపటి మాదిరిగానే రిలేషన్లో ఉన్నట్లుగా క్లారిటీ ఇచ్చింది.