Advertisement

మార్చిలో యుద్దం మొదలు పెట్టబోతున్న ఎన్టీఆర్‌

Posted : December 4, 2023 at 6:43 pm IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌ ఎంట్రీ కోసం ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే హృతిక్‌ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఏడాది కాలంగా ఈ సినిమా గురించిన చర్చ జరుగుతూనే ఉంది.

ముందుగా అనుకున్న ప్రకారం దేవర సినిమా షూటింగ్ ను డిసెంబర్‌ లో ముగించి, ఇదే డిసెంబర్‌ లో వార్‌ 2 సినిమా షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొనాల్సి ఉంది. కానీ దేవర షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు, వార్ 2 విషయంలో కూడా కాస్త మెల్లగా వర్క్ జరుగుతుందట. అందుకే ఎన్టీఆర్‌ యుద్దం మొదలు పెట్టడానికి కొత్త ముహూర్తం ఫిక్స్ అయింది.

ఎన్టీఆర్‌ సన్నిహితులు మరియు ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 2024 మార్చి మూడవ లేదా నాల్గవ వారంలో వార్ 2 సినిమా షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొనబోతున్నాడు. రెండు వారాల పాటు హృతిక్ రోషన్ తో కలిసి మొదటి షెడ్యూల్‌ లో యాక్షన్ ఎపిసోడ్స్ లో నటిస్తాడు.

ఏప్రిల్‌ లో దేవర సినిమా కు సంబంధించిన హడావుడి ఉంటుంది. అందుకే మళ్లీ మే నెలలో వార్ 2 షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొంటాడు. మొత్తానికి ఎన్టీఆర్‌ వచ్చే ఏడాది సమ్మర్‌ లో యుద్దం గట్టిగానే చేయబోతున్నాడు. హృతిక్‌ రోషన్‌ మరియు ఎన్టీఆర్‌ కాంబో సన్నివేశాలు అక్కడి వారిని ఇక్కడి వారిని కట్టిపడేసేలా ఉంటాయి అంటూ మేకర్స్ చెబుతున్నారు.

వార్ 2 సినిమా కథ అనుసారం ఇద్దరు స్నేహితులు మధ్య లో విభేదాలు తలెత్తడంతో కొట్టుకోవడం, మళ్లీ మంచి కోసం ఏకం అవ్వడం జరుగుతుందట. హృతిక్ మరియు ఎన్టీఆర్ కాంబో యాక్షన్‌ సన్నివేశాలను హాలీవుడ్‌ స్టంట్స్ కొరియోగ్రఫర్‌ తో డిజైన్‌ చేయించబోతున్నారట. మొత్తానికి వార్‌ 2 మరో లెవల్‌ లో ఉండటం ఖాయం అనిపిస్తోందని ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.


Advertisement

Recent Random Post:

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్‎పై ప్రభావమెంత? | Special Focus On Israel-Iran War Effect to India?

Posted : October 5, 2024 at 12:53 pm IST by ManaTeluguMovies

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్‎పై ప్రభావమెంత? | Special Focus On Israel-Iran War Effect to India?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad