Advertisement

రంగ మార్తాండ.. వరుడికి గోల్డెన్ గ్లోబ్..!

Posted : January 31, 2023 at 9:53 pm IST by ManaTeluguMovies

సకుటుంబ సపరివార సమేతంగా ఇలా పెళ్లి వేడుకలో దర్శనమివ్వడం బావుంది. పైగా జాతీయ ఉత్తమనటుడు ప్రకాష్ రాజ్ చెంత నవ వధూవరులు ఎంతో సంబరంగా కనిపిస్తున్నారు. అలా ప్రకాష్ రాజ్- రమ్యకృష్ణ ఒడిలో బుట్టబొమ్మలా ఒదిగిపోయిన యువకథానాయికతో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకను చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. ఇక ఇదే ఫ్రేమ్ లో హాస్య బ్రహ్మీ ఎక్స్ ప్రెషన్.. అనసూయ నవ్వుల్ చాలా ప్రత్యేకం. నవ వధువు శివాత్మిక వరుడు రాహుల్ పెయిర్ ఈడు జోడు చూడటానికి చాలా అందంగా ఉంది.

ఇంకా చెప్పాలంటే.. రంగమార్తాండ గోల్డెన్ గ్లోబ్ అందుకున్నంత కన్నుల పండుగగా ఉంది ఈ ఫ్రేమ్ చూస్తుంటే. మరోసారి కృష్ణ వంశీ మురారి- నిన్నే పెళ్లాడుతా రోజుల్లోకి వెళ్లిపోయి ఇలాంటి సృజనాత్మకతను ఆవిష్కరిస్తున్నారా? కలర్ ఫుల్ ఫ్రేములతో కళ తప్పిన తన కెరీర్ ని గాడిన పెట్టేందుకు దివ్యాస్త్రంతో దూసుకొస్తున్నారా? అన్నది చూడాలి. రంగ మార్తాండ ఇప్పటికే చాలా డిలే అయిందని అభిమానులు భావిస్తున్నారు. నేను లేటుగా వచ్చినా క్రియేటివ్ గా వస్తానని కృష్ణవంశీ నిరూపించాల్సిన సమయమిది. ఇటీవల కంటెంటే కింగ్ అని నిరూపణ అవుతోంది. కాబట్టి కాస్టింగ్ తో పనే లేదు. పైగా కృష్ణవంశీ లాంటి సీనియర్ దర్శకుడు ఈ సినిమాని ఉలి వేసి చెక్కుతున్నారన్న టాక్ ఉంది. రంగ మార్తాండ ఇంతకీ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందో చెప్పనే లేదు. దీనిపై స్పష్ఠత వస్తుందేమో చూడాలి.

ఆసక్తికరంగా ఈ ఫ్రేమ్ లో ఉన్న వరుడు రాహుల్ ఇటీవలే మరో ఘనత సాధించాడు. అదేమిటంటే.. వరల్డ్ ఫేమస్ గోల్డెన్ గ్లోబ్స్ లో పురస్కారం దక్కించుకున్న నాటు నాటు.. సాంగ్ ని తెలుగు-తమిళం-హిందీ-కన్నడ భాషల్లో పాడింది రాహుల్. కానీ అతడు లాస్ ఏంజెల్స్ లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేదికపై కనిపించలేదు.

దీంతో రాహుల్ కి అశేషంగా ఉన్న సోషల్ మీడియా అభిమానులు చిన్నబుచ్చుకున్నారు. పాడింది అతడు … నాటు నాటుకు డ్యాన్సులు కొరియోగ్రాఫ్ చేసింది ప్రేమ్ రక్షిత్. లిరిక్ రాసింది చంద్రబోస్. కానీ ఆ ముగ్గురూ అక్కడ వేదికపై కనిపించకపోవడంపై అభిమానులు అలకబూనారు. అయితే మరకతమణి ఎం.ఎం.కీరవాణి భారతదేశం తరపున గోల్డెన్ గ్లోబ్ అందుకోవడం.. వేదికపై సగర్వంగా ముద్దాడడం నిజంగా కన్నులపండుగను తలపించింది. ప్రపంచ సినీయవనికపై మన దేశ ఖ్యాతిని నిలబెట్టారు కీరవాణి అన్న ప్రశంసలు దక్కాయి.

అయితే నాటు నాటు.. ఒరిజనల్ సాంగ్ రచయిత అయిన చంద్రబోస్ అవార్డుల వేదికపైకి ఎందుకు వెళ్ళలేదు? తెలుగు- హింది- తమిళ్- కన్నడ నాలుగు భాషల్లో పాడిన రాహుల్ సిప్లిగంజ్ ఎందుకు వెళ్ళలేదు?

అద్భుతమైన కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ ఎందుకు వెళ్ళలేదు? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. కనీసం మార్చిలో జరగనున్న ఆస్కార్ ఫంక్షన్లో ఆర్.ఆర్.ఆర్ ఫ్యామిలీతో పాటు పాటకే అవార్డు కాబట్టి పాటకి పట్టం కట్టడంలో భాగమైన చంద్రబోస్- రాహుల్ సిప్లిగంజ్-కాలభైరవ- ప్రేమ్ రక్షిత్ లు కూడా ఆస్కార్ లో కనిపిస్తారని ఆశిద్దామంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Mudragada Padmanabham Reacts On His Daughter Comments

Posted : May 3, 2024 at 3:26 pm IST by ManaTeluguMovies

Mudragada Padmanabham Reacts On His Daughter Comments

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement