వెంకటేష్ అంటే అన్ని తరగతుల హీరోనే కాదు… అందరు నిర్మాతలకు అందుబాటులో ఉండే హీరో. పారితోషికం విషయంలో వెంకీ ఎప్పుడూ మార్కెట్ రేట్ కంటే తక్కువే కోట్ చేస్తుంటాడు. కానీ ఇఫ్ తర్వాత వెంకీ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు చాలా మంది నిర్మాతలు వెంకీతో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.
మరోవైపు బాలకృష్ణ కూడా తన సినిమాలకి ఎనిమిది, తొమ్మిది కోట్లు అడుగుతూ ఉంటే తాను మాత్రం ఎందుకని అయిదు కోట్ల రేంజ్ తో సరిపెట్టుకోవాలి అనుకున్నాడో ఏమో ఇప్పుడు వెంకటేష్ కూడా పది కోట్లు అడుగుతున్నది. ఒకేసారి తన పారితోషికం అంత పెంచేసే సరికి వెంకీతో చేద్దాం అనుకున్న రీమేక్స్ కి కూడా వేరే హీరోలని వెతుకుతున్నారట.
డిమాండ్ ఉంది కాబట్టి తనతో చేద్దాం అనుకున్న వాళ్ళు పది కాకపోయినా తొమ్మిది అయినా ఇస్తారని వెంకీ నమ్మకం. ఫ్ 2 చిత్రానికి అన్ని కోట్లు రాబట్టి, వెంకీ మామకి కూడా ఓపెనింగ్స్ తెప్పించిన వెంకీ అడిగేది రీజనబుల్ అనిపిస్తుంది.