Advertisement

సమంత గురించి మంచు లక్ష్మి కామెంట్స్..!

Posted : March 9, 2023 at 10:53 pm IST by ManaTeluguMovies

మంచు మోహన్ బాబు తనయురాలు మంచు లక్ష్మి నిర్మాతగా నటీమణిగా తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం ఆమె నటిస్తూ నిర్మిస్తున్న సినిమా అగ్ని నక్షత్రం. వంశీ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసా తెలుసా సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ ని సమంత రిలీజ్ చేశారు. ఉమెన్ ఎంపవర్ మెంట్ కి సంబంధించిన పాట అందుకే మహిళా దినోత్సవం నాడు రిలీజ్ చేశారు. మంచు లక్ష్మితో పాటుగా తన కూతురు నిర్వాణ కూడా ఈ సినిమాలో నటించింది.

కూతురితో కలిసి నటించిన మొదటి సినిమా ఇదే అని మంచు లక్ష్మి అన్నారు. అంతేకాదు సమంత గురించి కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపం అని.. ఆమె ఇప్పటివరకు ఎన్ని కష్టాలు పడ్డదో తనకు తెలుసని అన్నారు మంచు లక్ష్మి.

సమంతతో తన రిలేషన్ గురించి మాట్లాడిన లక్ష్మి పరిశ్రమలో మహిళలుగా మనం ఏదైనా సొంతంగా చేసుకోవాల్సిందే. సమంత ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు.. ఆమె స్థానంలో మరెవరు ఉన్నా చాలా నలిగిపోయే వారని అన్నారు మంచు లక్ష్మి.

చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా సమంత తనను తాను మలుచుకున్న తీరు అందరికీ స్పూర్తినిస్తుందని.. నిజమైన సాధికారత పొందిన మహిళ సమంత అలాంటి ఆమె ఈరోజు ఇలాంటి సాంగ్ రిలీజ్ చేయడం మరింత శక్తినిస్తుందని అన్నారు.

సాంగ్ రిలీజ్ చేసిన సమంత పవర్ ఫుల్ పాటతో వచ్చినందుకు లక్ష్మిని అప్రిషియేట్ చేస్తున్నా.. చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్న ఈ పాట రోజుల తరబడి మనతోనే ఉంటుందని.. విజువల్స్ కూడా చాలా బాగున్నాయని అన్నారు. అర్ధవంతమైన పాట వీలైనంత ఎక్కువ మంది మహిళలకు చేరుకోవాలని అన్నారు సమంత.


Advertisement

Recent Random Post:

Konda Surekha వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున | Akkineni Nagarjuna | Naga Chaitanya

Posted : October 3, 2024 at 5:43 pm IST by ManaTeluguMovies

Konda Surekha వ్యాఖ్యలపై కోర్టుకెళ్లిన నాగార్జున | Akkineni Nagarjuna | Naga Chaitanya

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad