Advertisement

సుప్రీమ్ యాస్కిన్.. ఈ లుక్ ట్రై చేసి ఉంటే..

Posted : July 3, 2024 at 2:31 pm IST by ManaTeluguMovies

కల్కి 2898ఏడీ మూవీలో ప్రతినాయకుడు సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నటించారు. ఈ సినిమాలో అతను రెండు సన్నివేశాలలో మాత్రమే కనిపించినప్పటికి ఆ పాత్ర ఇంపాక్ట్ చాలా ఉందని చెప్పొచ్చు. పార్ట్ 2లో సుప్రీమ్ యాస్కిన్ డైరెక్ట్ గా రంగంలోకి దిగుతున్నాడు కాబట్టి కచ్చితంగా కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని అర్ధమవుతోంది. అలాగే అతని పెర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండటం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.

సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ ని కమల్ హాసన్ కెరియర్ లో ఇప్పటి వరకు చేయని లుక్ లో డిజైన్ చేశారు. ఆ లుక్ వికారంగా అందరిని భయపెట్టేలా ఉంది. ఇలాంటి సూపర్ సోనిక్ మూవీస్ లలో ప్రతినాయకుడు అంటే ఎలా ఉండాలో కరెక్ట్ గా అంచనాలు వేసి కమల్ హాసన్ పోషించిన సుప్రీమ్ యాస్కిన్ మేకోవర్ చేశారు. అయితే ఈ పాత్ర కోసం నాగ్ అశ్విన్, కమల్ హాసన్ చాలా లుక్స్ ట్రై చేశారని టాక్ బయటకొచ్చింది.

నటుడిగా కమల్ హాసన్ అన్ని రకాల లుక్స్ లో కనిపించాడు. అయితే అస్సలు టచ్ చేయని కొత్త అవతారంలో కనిపించాలని భావించారంట. అందుకోసం చాలా రకాల లుక్ టెస్ట్ లు చేసారంట. అయితే వాటిలో కొన్ని హాలీవుడ్ సినిమాలలో క్యారెక్టర్స్ కి దగ్గరగా ఉండటంతో వద్దనుకున్నారంట. ఫైనల్ గా ప్రస్తుతం కల్కి2898ఏడీలో ఉన్న రెండు భిన్నమైన లుక్స్ ని కన్ఫర్మ్ చేశారు. ఈ లుక్స్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో కల్కిలో సుప్రీమ్ యాస్కిన్ కోసం ట్రై చేసిన మరో లుక్ బయటకొచ్చింది. అందులో విచిత్రమైన అవతారంలో డిఫరెంట్ వస్త్రధారణ సుప్రీమ్ యాస్కిన్ ఉన్నాడు. ఈ లుక్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. అయితే ఈ లుక్ హాలీవుడ్ లో మ్యాడ్ మ్యాక్స్ కి మూవీలో ఉందనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి. ఈ లుక్ పెట్టి ఉంటే మ్యాడ్ మ్యాక్స్ కాపీ అనేవారని పోస్ట్స్ పెడుతున్నారు.

ఇలాంటి లుక్ ట్రై చేయకుండా ఉండటం మంచిదయ్యిందని అంటున్నారు ఈ లుక్ పవర్ ఫుల్ గా ఉన్న హాలీవుడ్ కాపీ ఆరోపణలు కచ్చితంగా వచ్చేవని కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ విజన్ చాలా అద్భుతంగా ఉందని ఈ లుక్ చూస్తుంటే అర్థమవుతోందని మరికొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.


Advertisement

Recent Random Post:

YS Jagan Hot Comments on CM Chandrababu

Posted : October 3, 2024 at 9:53 pm IST by ManaTeluguMovies

YS Jagan Hot Comments on CM Chandrababu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad