Advertisement

సూపర్ స్టార్ నాలుగు సినిమాలు.. నిరాశలో ఫ్యాన్స్!

Posted : July 5, 2023 at 10:54 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ 2016 లో దంగల్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఇండియన్ సినిమా దంగల్ కలెక్షన్స్ ను బీట్ చేయలేక పోయింది. దంగల్ సినిమా తర్వాత అమీర్ ఖాన్ మరో సినిమా తో ఇప్పటి వరకు సక్సెస్ ను దక్కించుకోలేదు.

దంగల్ తర్వాత అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్.. లాల్ సింగ్ చద్దా తో పాటు మరికొన్ని సినిమాలు చేసినా కూడా ఏ ఒక్కటి సక్సెస్ అవ్వలేదు. ముఖ్యంగా లాల్ సింగ్ చద్దా వందల కోట్ల సినిమా అనుకుంటే మినిమం వసూళ్లు కూడా రాబట్టలేక చేతులు ఎత్తేసింది. అమీర్ ఖాన్ స్థాయిని ఆ సినిమా దిగజార్చిందనే విమర్శలు వచ్చాయి.

లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్ తో అమీర్ ఖాన్ కొత్త సినిమాల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నాడు అనిపిస్తుంది. హీరో గా సినిమాలు ఇప్పటి వరకు కొత్త వాటిని ప్రకటించలేదు. కానీ నిర్మాతగా మాత్రం నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఏడాది గ్యాప్ లోనే ఆ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.

అమీర్ ఖాన్ నిర్మాణం లో రూపొందుతున్న సినిమాల విషయానికి వస్తే… ఆర్ఎస్ ప్రస్సన దర్శకత్వం లో స్పానిష్ చిత్రం ఒకటి రీమేక్ అవుతోంది. అందులో ఫర్హాన్ అక్తర్ నటిస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ జయ జయ జయహే సినిమా ను హిందీ లో అమీర్ ఖాన్ రీమేక్ చేస్తున్నాడు.

ఆ రీమేక్ లో ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ప్రీతమ్ ప్యారే షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యి.. విడుదలకు సిద్ధం అవుతోంది. మరో వైపు తన మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వంలో కూడా అమీర్ ఖాన్ ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. అమీర్ ఖాన్ నిర్మిస్తున్న ఒకటి రెండు సినిమాల్లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు.

నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్న అమీర్ ఖాన్ ఎందుకు హీరోగా మాత్రం ఇప్పటి వరకు కొత్త సినిమా ను ప్రకటించలేదు అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన లాల్ సింగ్ చద్దా ఫలితం నుండి అమీర్ ఖాన్ ఇంకా బయట పడలేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

పేద ప్రజల జీవిత ఆశయం ఇల్లు కట్టుకోవడం : Danam Nagender

Posted : September 29, 2024 at 6:17 pm IST by ManaTeluguMovies

పేద ప్రజల జీవిత ఆశయం ఇల్లు కట్టుకోవడం : Danam Nagender

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad