‘టచ్ చేసి చూడు’, ‘నెల టికెట్టు’, ‘అమర్ అక్బర్ ఆంథోనీ’, ‘డిస్కో రాజా’ సినిమాలతో వరుస డిజాస్టర్స్ లో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ ఆశలన్నీ ప్రస్తుతం తను చేస్తున్న ‘క్రాక్’ సినిమాపైనే ఉన్నాయి. అభిమానులు ఎలా కోరుకుంటారో అలానే గోపీచంద్ మలినేని రవితేజని చూపించనున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 1న రిలీజ్ కానుంది.
ప్లాప్స్ ఎఫెక్ట్ వలన రవితేజ మళ్ళీ తన పాత పంథాలోకి వచ్చి మాస్ సినిమాలు చేయడానికి డిసైడ్ అయినా రవితేజ క్రాక్ తర్వాత రమేష్ వర్మ మరియు త్రినాధ్ రావు నాక్కినితో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రమేష్ వర్మ సినిమా నాకోసం బాలీవుడ్ బ్యూటీస్ ని ట్రై చేస్తున్నారని ఇది వరకే తెలిపాం. కానీ త్రినాధ్ రావు నక్కిన మాత్రం ప్రస్తవుతాం హిట్స్ తో దూసుకెళ్తున్న తమన్నాని హీరోయిన్ గా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.
ఇప్పటికే కథ వినిపించి తమన్నాని కలిశారు. తమన్నా ఫైనల్ కాల్ తీసుకోవాల్సి ఉంది. రవితేజ – తమన్నాలు గతంలో బెంగాల్ టైగర్ లో కనిపించి హిట్ జోడీ అనిపించుకున్నారు. మరి ఈ సరి కూడా ఈ జోడీ హిట్ కొడుతుందేమో చూడాలి.