Advertisement

అతని గురించి అనుష్క సైలెన్స్!

Posted : February 29, 2020 at 1:01 pm IST by ManaTeluguMovies

అనుష్క పెళ్లి, ప్రేమ గురించి ఇంత వరకు చాలా పుకార్లు వచ్చాయి. ప్రభాస్, క్రిష్, నిమ్మగడ్డ ప్రసాద్… ఇలా పలువురితో ఆమెకి పెళ్లి అంటూ చాలా వదంతులే వినిపించినా ఏదీ నిజం కాలేదు. సడన్ గా ఆమెను రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కి లింక్ చేస్తూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అనుష్కతో సైజ్ జీరో చిత్రాన్ని తీసిన ప్రకాష్ కొద్ది కాలం క్రితమే కనికా దిల్లాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు.

అనుష్కని పెళ్లి చేసుకునే విషయంలో ప్రకాష్ సీరియస్ గా ఉన్నాడని, తన తండ్రిపై కూడా ఒత్తిడి తెస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. మీడియాలో ఈ వార్త గుప్పుమంటున్నా కానీ అనుష్క ఏదీ విననట్టే నిశ్శబ్దం పాటిస్తోంది. ఈ రూమర్ అయినా నిజమయి అనుష్క ఫైనల్ గా సెటిల్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి తనకు నిశ్శబ్దం తప్ప ఆఫర్స్ కూడా లేవు.


Advertisement

Recent Random Post:
Advertisement