మెగా కుటుంబం నుంచి క్రికెట్ టీం కి సరిపడా హీరోలు దిగిపోయారని జోకులున్నాయి. అయితే ఒకే టీంలో ఇంతమంది సక్సెస్ఫుల్ ప్లేయర్స్ ఉండడం మాత్రం కచ్చితంగా సూపర్ అనుకోవాలి. ఇప్పటికే పలువురు మెగా హీరోలు టాప్ లో ఉన్నారు.
ఇంకొందరు బిజీగా ఉన్నారు. తాజాగా ఈ టీం నుంచి బాటింగ్ కి దిగుతున్న ప్లేయర్ సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్. ఉప్పెన సినిమాతో ఈ కుర్రాడు మొదటి ఇన్నింగ్స్ ఆడబోతున్నాడు. ఈ సినిమా పట్ల పాజిటివ్ వైబ్ సెట్ అయింది. విడుదలయిన రెండు పాటలు బాగున్నాయి. కొత్త జంట బాగున్నారని తేజ్, కృతి శెట్టి గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఈ చిత్రం గురించి ఇండస్ట్రీలో కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
చూస్తుంటే మెగా కుటుంబం నుంచి మరో హీరో హిట్ సినిమాతో రంగంలోకి దిగేలా ఉన్నాడు. చాలా కాలం పాటు వేచి చూసిన వైష్ణవ్ తన అన్నయ్యలా కాకుండా మొదటి అడుగు జాగ్రత్తగానే వేసినట్టున్నాడు.