మగధీరతో అప్పటికి ఉన్న ఇండస్ట్రీ రికార్డులని డబల్ మార్జిన్ తో బద్దలు కొట్టిన రామ్ చరణ్ ఆ క్రేజ్ ని అలాగే నిలబెట్టుకోవడం కోసం టాప్ డైరెక్టర్స్ తోనే చేయాలని కూర్చోలేదు. అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత సంపత్ నంది లాంటి అసలు ఎవరికీ తెలియని దర్శకుడితో చేయడం అప్పట్లో అందరిని ఆశ్చర్యపరచింది.
ఇప్పుడు కూడా చరణ్ అలాగే ఆలోచిస్తున్నాడు. రాజమౌళి సినిమా చేస్తున్నాం కాబట్టి ఆ తర్వాత చేసేవి అన్ని పాన్ ఇండియా సినిమాలు కావాలని లేదని, అలాగే అగ్ర దర్శకుల కోసమే అంటూ కూర్చుంటే సమయం వృధా అవుతుందని చరణ్ భావిస్తున్నాడు. సుజీత్, వెంకీ కుడుములు లాంటి యువ దర్శకులతో పని చేయడానికి కూడా అభ్యంతరం లేదని చెబుతున్నాడు.
అలాగని గతంలో మాదిరిగా మసాలా సినిమాలు చేయనని, కథా బలం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానని క్లియర్ చేస్తున్నాడు. రాజమౌళి సినిమాలో చరణ్ తో పాటు నటిస్తున్న తారక్ మాత్రం ప్రయోగాల జోలికి పోకుండా త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో సినిమా ముందే ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు.