ఇండియన్ ఆడియన్స్‌లో వెబ్ సిరీస్‌ల గురించి బాగా చర్చ జరిగేలా చేసిన వాటిలో ‘లస్ట్ స్టోరీస్’ ఒకటి. నెట్ ఫ్లిక్స్ గురించి సామాన్య ప్రేక్షకులకు కూడా తెలిసేలా చేసిందీ సిరీస్. ఇందులో కియారా అద్వానీ తదితరులు ఎంత బోల్డ్‌గా నటించారో తెలిసిందే.
అందులోని సన్నివేశాలు సూపర్ పాపులర్ అయ్యాయి. అమ్మాయిల్లో ఉండే సెక్సువల్ డిస్ప్లెజర్ గురించి ఇందులో చాలా బోల్డ్‌గా డిస్కస్ చేశారు. ఇప్పుడీ సిరీస్ తెలుగులోకి రాబోతోంది. అందులోని ఒక పార్ట్‌లో తెలుగమ్మాయి ఈషా రెబ్బా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు వెర్షన్లో ఈషా నటిస్తోందనేసరికి.. ఒక్కసారిగా ఆమె ఇంత బోల్డ్ క్యారక్టర్ చేస్తుందా అని ఆశ్చర్యపోయారందరూ. ఈ సిరీస్‌లో ఆమె రెచ్చిపోయి నటిస్తుందనే అంచనాతో ఉన్నారు.
ఐతే తెలుగు ‘లస్ట్ స్టోరీస్’ కంటెంట్ పరంగా బోల్డ్‌గానే ఉంటుందని.. కానీ వల్గారిటీ మాత్రం ఉండదని అంటోంది ఈషా. ఇందులో తానేమీ స్కిన్ షో చేయట్లేదని ఆమె స్పష్టం చేసింది. గ్లామర్ విషయంలో హద్దులు దాటకుండానే బోల్డ్ నెస్ చూపించినట్లు ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.
ఇలాంటి సిరీస్ తెలుగు వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారని అడిగితే.. గత కొన్నేళ్లలో తెలుగు సినిమాలు చాలా మారాయని, మన ప్రేక్షకుల అభిరుచి కూడా మారిందని.. ‘లస్ట్ స్టోరీస్’ను బాగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉందని ఆమె చెప్పింది.
ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. ఆరంభంలో ‘తెలుగమ్మాయి’ అనే ట్యాగ్ వల్ల తాను ఇబ్బంది పడ్డానని.. కానీ ఇప్పుడలా లేదని.. బోలెడన్ని అవకాశాలతో చాలా బిజీగా ఉన్నానని ఈషా చెప్పింది.
ఈ ఏడాది తమిళం, కన్నడ భాషల్లో తాను అరంగేట్రం చేస్తున్నాయని.. బాలీవుడ్ నుంచి కూడా రెండు అవకాశాలు వచ్చాయని.. కరోనా ఎఫెక్ట్ తగ్గాక వాటి గురించి వెల్లడిస్తానని.. తెలుగులో కూడా రెండు సినిమాలు చేస్తున్నానని ఈషా చెప్పింది.