కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమ కుదేలయ్యేలా చేసింది. సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కూడా కరోనా ప్రభావంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతలు ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. సినిమాలపై కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఇప్పుడు ఆ సినిమాలు విడుదల చేయలేక అలాగే పెట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో స్టార్స్ కాస్త మంచి మనసు చేసుకోవాలంటూ నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజాగా దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో స్టార్స్ నటీనటులు దర్శకులు కూడా తమ పారితోషికాలను తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు మునుపటిలా ఉండవు. అన్ని విషయాల్లో కూడా మార్పులు వస్తాయంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సినిమాల మేకింగ్ విషయంలో నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వాల్సి రావచ్చు. అందుకే దర్శకులు హీరోలు కాస్త పారితోషికాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ జక్కన్న సలహా ఇచ్చాడు.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను దాదాపుగా 400 కోట్ల బడ్జెట్‌తో రాజమౌళి తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యింది. కనుక బడ్జెట్ విషయంలో ఇప్పటి నుండైనా కాస్త కాంప్రమైజ్ అవ్వనున్నాడా లేదంటే హీరోలు మరియు తాను పారితోషికాల విషయంలో కాంప్రమైజ్ అవ్వనున్నారో చూడాలి.