మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాలోనే జెస్సిగా కుర్రకారు మొత్తాన్ని తన మాయలో పడేసుకున్న హీరోయిన్ సమంత.. తెలుగులో మొదటి సినిమా భారీ విజయం సాధించడం, వెంటనే ఎన్.టి.ఆర్ ‘బృందావనం’ మరియు మహేష్ బాబు ‘దూకుడు’ సినిమాల్లో అవకాశం రావడం.. అవి బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. టాలీవుడ్ గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.. ఇక కెరీర్ పరంగా వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు. మొదట్లో తనకి స్టార్ హీరోల సరసన గ్లామరస్ రోల్స్ వచ్చినప్పటికీ ప్రతి సినిమాలోనూ తన పాత్రలకి ప్రాముఖ్యత ఉండడం, ప్రతి పాత్రలోనూ ఒదిగిపోయి నటించడంతో సమంత గ్లామరస్ హీరోయిన్ గానే కాకూండా ఓ స్ట్రాంగ్ పెర్ఫార్మర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఒక స్టేజ్ తర్వాత తను సెలక్ట్ చేసుకున్న పాత్రలకి తాను తప్ప ఎవరూ న్యాయం చేయలరు అన్నతంగా తన నటనతో మెప్పించి తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. నటిగా కొనసాగుతూనే అక్కినేని వారసుడు నాగ చైతన్యని ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని ఇంటి కోడలైంది. పెళ్లి తర్వాత తను చేసిన రంగస్థలం, మహానటి, మజిలీ, ఓ బేబీ లాంటి సినిమాలు నటిగా తనని శిఖరాగ్ర స్థాయికి చేర్చిన సినిమాలని చెప్పచ్చు.
నేడు సమంత అక్కినేని పుట్టిన రోజు.. ఈ సందర్భంగా తెలుగుబుల్లెటిన్.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే సమంత అక్కినేని కెరీర్లో తెలుగులో తనని అగ్ర కథానాయికని చేసిన, అద్భుతమైన పెర్ఫార్మన్స్ కనబరిచిన టాప్ 11 ఫిలిమ్స్..
1. ఏ మాయ చేసావే
మొదటి సినిమాలో కేరళ కుట్టి ‘జెస్సీ’గా సమంత యువ హృదయాల్ని కొల్లగొట్టింది.
2. దూకుడు
స్టైలిస్ట్ ప్రశాంతిగా మహేష్ బాబు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంది.
3. ఈగ
బిందుగా తన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో అందరి నుంచీ సమంత సూపర్ క్యూట్ అండ్ గ్లామరస్ హీరోయిన్ మాత్రమే కాదు సూపర్ టాలెంటెడ్ కూడా అని ప్రూవ్ చేసిన సినిమా.
4. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
గీతగా చిన్నోడి మనసు దోచుకొని, మహేష్ బాబు – సమంతలది సూపర్ హిట్ జోడీ అనిపించిన సినిమా.
5. అత్తారింటికి దారేది
పొగరు, అల్లరి, అమాయకత్వం కలిసిన పాత్రలో అద్భుతంగా నటించి పవన్ కళ్యాణ్ తో కెమిస్ట్రీ అదుర్స్ అనిపించిన సినిమా.
6. మనం
ఒకరేమో అల్లరి పిల్ల మరొకరేమో ఎమోషనల్.. ఇలా ఒక్క సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో శభాష్ అనిపించుకున్న సినిమా.
7. అఆ
అనసూయ రామలింగం – సమంత అమాయకత్వంలో ఇంత క్యూట్ అండ్ లవ్లీగా ఉంటుందా అని ప్రూవ్ చేసిన సినిమా ఇది.
8. రంగస్థలం
పక్కా పల్లెటూరి రామలక్ష్మిగా సమంత ఒదిగిపోయిన సినిమా ఇది.. రామలక్ష్మిగా తన నటన అద్భుతం అని చెప్పడానికి ‘ఎంత సక్కగున్నవే’ పాటలోని తన ఎక్స్ ప్రెషన్స్ చాలు..
9. మహానటి
ఇది సావిత్రి గారి బయోపిక్ అయినప్పటికీ.. కీర్తి సురేష్ సినిమా అంతా సావిత్రి గారిలా నటించి తెచ్చుకున్న క్రేజ్ సమంత ఒక్క ఎమోషనల్ క్లైమాక్స్ సీన్ తో కొట్టేసింది అనడంలో అతిశయోక్తి లేదు.
10. మజిలీ
ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ పాత్ర చేయాలంటే సమంత అక్కినేని తప్ప మరెవరూ లేరు అనేలా, సమంత శ్రావణి పాత్రలో జీవించి.. అందరినీ ఏడిపించేసిన సినిమా..
11. ఓ బేబీ
ఓ ముసలావిడకి యవ్వనం వస్తే అడ్డు అదుపు లేకుండా ఎంత అల్లరి చేస్తుందో, అంతే ఎమోషనల్ గా ఉంటది.. అనే పెర్ఫార్మన్స్ కి కేరాఫ్ అడ్రస్ సమంత పెర్ఫార్మన్స్ అని చెప్పచ్చు..
ఇవి కాకుండా ఆమె తమిళంలో నటించిన ఎన్నో సినిమాలలో కూడా అద్భుతమైన నటనని కనబరిచి తన సొంత లాంగ్వేజ్ లో కూడా ఓ మరువలేని హీరోయిన్ గా సమంత స్థానం సంపాదించుకుంది.