తెలుగు చిత్ర పరిశ్రమ గురించి గొప్పగొప్ప మాటలు చెప్పడం సులభం. కానీ కష్టాలొచ్చినప్పుడు ఆదుకోవడమే కష్టం. తెలుగు చిత్ర పరిశ్రమ కళామతల్లి ఎంతో మందికి ఉపాధి చూపుతోంది. వందలాది మంది కడుపు నింపుతోంది. అలాగే సమాజంలో సెలబ్రిటీలుగా తీర్చిదిద్ది స్టార్ ఇమేజ్‌ను తెచ్చి పెడుతోంది. ఇన్ని రకాల ప్రయోజనాలు కల్పించే ఆ తెలుగు చిత్ర పరిశ్రమ తల్లి కష్టాల్లో ఉన్నప్పుడు…తమ వంతు బాధ్యతగా ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన బాధ్యత కూడా ఉంది.
నిర్మాతల సంతోషంపైనే చిత్ర పరిశ్రమ యోగక్షేమాలు ఆధారపడి ఉన్నాయి. లాక్‌డౌన్‌తో చిత్ర పరిశ్రమ షూటింగ్‌లకు నోచుకోక ఆర్థికంగా కుదేలైంది. దీన్ని చక్కదిద్దాలంటే చిత్ర నిర్మాణం భారం కాకూడదు. అంటే హీరో, హీరోయిన్లు, దర్శకులు తమ పారితోషి కంలో స్వచ్ఛందంగా కోత విధించుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కోలీవుడ్‌లో హీరోలు, దర్శకుల నుంచి కొంత వరకు సపోర్ట్ లభిస్తోంది.
హీరోయిన్ తాప్సీ తన పారితోషికాన్ని తగ్గించుకుంటున్నట్టు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రకటించి స్ఫూర్తిదాయకంగా నిలి చారు. ఇప్పుడు తాప్సీ బాటలోనే మరో అగ్రహీరోయిన్ రకుల్ నడిచేందుకు సిద్ధమయ్యారు. తన పారితోషికాన్ని తగ్గించుకోవా లని నిర్ణయించుకున్నట్టు సమాచారం. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిన రకుల్ ఒక్కో సినిమాకు కోటి రూపాయలు తీసుకుంటారని తెలుస్తోంది.
రెమ్యునరేషన్‌లో 30 నుంచి 50 శాతం వరకు తగ్గించుకునేందుకు రకుల్ ఉందంటున్నారు. రెమ్యునరేషన్ తగ్గినా…సినిమా చాన్స్‌లు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఏది ఏమైనా హీరోయిన్లు తాప్సీ, రకుల్…మున్ముందు ఇంకా ఎవరైనా ముందుకొచ్చే అవకాశాలున్నాయంటున్నారు. నిర్మాతల పాలిట రియల్ హీరోలు ఈ హీరోయిన్లు అని చెప్పక తప్పదు.