కరోనా అనేది లేకుండా ఉంటే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉండి ఉంటారు. కానీ కరోనా వలన అన్ని పనులు ఆగిపోయాయి. దాంతో జూన్ నుంచి ఇవ్వనున్న షూటింగ్ పర్మిషన్స్ పరంగా తక్కువ మందితో షూటింగ్ చేయాల్సి వస్తోంది. దాంతో అనుకున్న టైం కన్నా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. సో, ఎన్.టి.ఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ఫినిష్ చేసి ఫ్రీ అవ్వడానికి ఎక్కువ టైమే పడుతుంది.
ఎక్కువ గ్యాప్ వచ్చేలా ఉంటే త్రివిక్రమ్ అప్పటి వరకూ ఎన్.టి.ఆర్ కోసం వెయిట్ చేయకుండా ఈ గ్యాప్ లో మరో చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నారని ఇది వరకే తెలిపాం. అది మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుం కోశియుమ్’ అయ్యే అవకాశం కూడా ఉందని తెలిపాం. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ వెంకటేష్ – నానీలు సరిపోయేలా ఓ కథని కూడా అనుకుంటున్నారట. ఎన్.టి.ఆర్ సినిమాతో పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా చేస్తున్నాడని సమాచారం. సినిమా షూటింగ్స్ తక్కువ మందితో అయినా మొదలై, మళ్ళీ పట్టాలెక్కితే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొదలైన ఓ 15 రోజులకి ఎన్.టి.ఆర్ షెడ్యూల్స్ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ కోసం వెయిట్ చేయాలా లేక తన మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేసుకోవాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటారు.
అప్పటి లోగా త్రివిక్రమ్ రెండు కథలని పగడ్బందీగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు త్రివిక్రమ్ సినిమాలో ఎన్.టి.ఆర్ ఓ టాప్ కార్పొరేట్ బిజినెస్ మాన్ గా కనిపిస్తారని, తన స్టైలిష్ లుక్ కోసం డిజైనింగ్స్ రెడీ అవుతున్నాయని సమాచారం.