Advertisement

బుట్టబొమ్మపై మళ్లీ స్పందించిన స్టార్‌ క్రికెటర్‌

Posted : November 24, 2020 at 12:26 pm IST by ManaTeluguMovies

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలోని పాటలు ఏ స్తాయిలో సక్సెస్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటలు అన్ని కూడా సూపర్‌ హిట్‌ అవ్వడంతో పాటు రికార్డుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే బిలియన్‌ వ్యూస్‌ మార్క్‌ ను దాటాయి. ఒక్కో పాట కూడా వివిధ రికార్డులను నమోదు చేస్తున్నాయి. తాజాగా బుట్ట బొమ్మ పాట ఏకంగా 450 మిలియన్‌ల వ్యూస్‌ ను సొంతం చేసుకుంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్‌ ను విడుదల చేశారు.

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ గతంలో బుట్ట బొమ్మ పాటకు డాన్స్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఆయన మరోసారి బుట్టబొమ్మ పాట గురించి స్పందించాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో బుట్టబొమ్మ 450 మిలియన్‌ లు దక్కించుకున్న సందర్బంగా వెల్‌ డన్‌ అంటూ అభినందించాడు. అల్లు అర్జున్‌ ను ట్యాగ్‌ చేసిన డేవిడ్‌ వార్నర్‌ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. బుట్ట బొమ్మ సాంగ్‌ మరెన్ని రికార్డులను నమోదు చేస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదిలో ఏకంగా ఈ స్థాయి వ్యూస్‌ రావడం అంటే మామూలు విషయం కాదు.

సినిమాలోని ప్రతి పాట కూడా మంచి విజయం దక్కించుకున్న కారణంగా ఇప్పటికే అల ఆల్బం వెయ్యి మిలియన్‌ లను క్రాస్‌ చేసి అరుదైన రికార్డును నమోదు చేసింది. అన్ని వర్గాల వారిన ఆకట్టుకునేలా ఈ పాటలు ఉన్నాయి. ప్రస్తుతం పాటలు కొత్తవి ఏమీ లేక పోవడంతో ఈ పాటలనే ఇంకా జనాలు వింటూ ఉన్నారు. వచ్చే ఏడాది వరకు ఈ పాటలు ట్రెండ్‌ అవుతూనే ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Intinti Ramayanam – Promo | New Serial | Star Maa Serials | Coming Soon only on Star Maa

Posted : May 4, 2024 at 9:43 pm IST by ManaTeluguMovies

Intinti Ramayanam – Promo | New Serial | Star Maa Serials | Coming Soon only on Star Maa

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement