తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు కల్వకుంట హిమాన్షు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్నప్పటి నుండే ఈ బుడ్డోడు మీడియాలో కనిపిస్తూ వస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే తండ్రి ని మించిన పర్సనాలిటీని పొందినా కూడా ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా తన చిన్న సమస్యను పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకున్న హిమాన్షు గురించి మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రాను అన్నాడు.
సోషల్ మీడియా ద్వారా కూడా మళ్లీ అదే విషయాన్ని తెలియజేశాడు. నా డ్రీమ్స్ నాకు ఉన్నాయి. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోకి వెళ్లను అన్నాడు. హిమాన్షు రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదు కాని ఆయన ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడని అయితే నటుడిగానా లేదా నిర్మాత లేదా దర్శకుడిగా ఆయన కెరీర్ ను కొనసాగిస్తాడా అనేది చూడాలి.