Advertisement

యోగీ సీటూ ఫేటూ మార్చేసింది ఎవరు… ?

Posted : January 17, 2022 at 12:38 pm IST by ManaTeluguMovies

యూపీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీల బయట రాజకీయం ఉంది. లోపల కూడా రాజకీయం రంజుగా సాగుతోంది. యూపీ మీద ఏకంగా కేంద్రంలోని బీజేపీ కన్నేసింది. యూపీని గెలిచి తీరాలన్న ఆలోచనలో ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఇబ్బందే అని తెలుసు. అయితే ఆ పరాజయాల మరక మచ్చ జాతీయ నాయకత్వం తమకు అంటించుకోకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

యూపీ సీఎం ఆదిత్యనాధ్ యోగీ తాను పోటీ చేస్తారనుకున్న చోట నుంచి కొత్త సీటుకు మారారు. ఆయన ఆఖరు నిముషంలో గోరఖ్ పూర్ నుంచి పోటీకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. నిజానికి మొదటి నుంచి యూపీ బీజేపీ వర్గాలు చెబుతున్నది ఏంటి అంటే యోగీ మధుర కానీ అయోధ్య కానీ పోటీకి ఎంచుకుంటారని. ఆ విధంగానే పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం సాగింది.

అయితే లాస్ట్ మినిట్ లో యోగీ సీటు ఒక్కసారిగా చేంజి అయిపోయింది. దీంతో యోగీ అనుచరులే ఆశ్చర్యపోతున్నారు. యోగీ తన ఇష్టప్రకారమే ఆ సీటుని ఎంచుకున్నారని అంతా అనుకుంటున్నారు. కానీ అలా కాదుట. దాని వెనక బీజేపీ ఎన్నికల చిత్రం ఉంది అంటున్నారు.

అదెలా అంటే ప్రధాని మోడీ జోక్యం తోనే యోగీ సీటు మారింది అన్నది ప్రచారంలో ఉందిపుడు. పక్కా వ్యూహంతోనే మోడీ యోగీ సీటుని అలా మార్చేలా చేశారు అంటున్నారు. యూపీలోని పూర్వాంచల్ లో బీజేపీకి ఇపుడు గడ్డు పరిస్థితి ఉంది. కీలకమైన నాయకులు అంతా కూడా బీజేపీని వీడిపోయింది అక్కడ నుంచే. వారు ఎస్పీలో చేరిపోయారు. పైగా అక్కడ దళితులు ఓబీసీలకు గట్టి పట్టు ఉంది.

దాంతో ఇక్కడ విపక్షాలకు అనుకూల స్థావరంగా మారిపోయింది. దాన్ని దెబ్బకొట్టాలీ అంటే యోగీని అక్కడ నిలబెట్టాలని ఆలోచించే మోడీ ఇలా ఆయన సీటుని మార్చేశారు అంటున్నారు. ఇక్కడ యోగీ ఇమేజ్ వర్కౌట్ అయి బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటే కచ్చితంగా బీజేపీ విజయం సాధ్యపడుతుంది. అలా మోడీ వ్యూహం హిట్ అయి ఆయనకు పేరు వస్తుంది.

ఒకవేళ అలా జరగకుండా విపక్షాలు కనుక గెలిస్తే మాత్రం యోగీ మీద ఆ నెపం పాపం పూర్తిగా పోతుంది. ఆయనకు ఇమేజ్ లేదని ప్రచారం చేయడానికి ఎటూ బీజేపీలోని ఆయన వ్యతిరేకులు సిద్ధంగా ఉంటారు అంటున్నారు. మొత్తానికి పూర్వాంచల్ లో ఓడితే అది యోగీ ఖాతాలోకి గెలిస్తే మాత్రం మోడీ అకౌంట్ లోకి. బీజేపీ ప్లాన్ బాగుంది కానీ పూర్వాంచల్ లో ఈ టైమ్ లో బీజేపీ గెలవడం కష్టమే అంటున్నారుట. మరి యోగీజీ ఆఖరు క్షణాన సీటు మార్చినా బీజేపీ ఫేట్ మార్చలేరు అంటున్నారు. అంతే కాదు ఆయన జాతకం కూడా పూర్వాంచల్ మార్చేసేలా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Advertisement

Recent Random Post:

2027 ఆఖరిలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి : Vijaysai Reddy | YSRCP

Posted : November 3, 2024 at 6:23 pm IST by ManaTeluguMovies

2027 ఆఖరిలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి : Vijaysai Reddy | YSRCP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad