Advertisement

ప్రభుత్వంపై సెటైర్: టాలీవుడ్ సెలబ్రిటీల మాటల యుద్ధం

Posted : February 4, 2022 at 3:15 pm IST by ManaTeluguMovies

ఏపీ ప్రభుత్వంపై ప్రముఖ రచయిత బివిఎస్ రవి వేసిన సెటైర్, దర్శకుడు హరీష్ శంకర్ తో మాటల యుద్దానికి దారి తీయడం ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రభుత్వ తీరుపై రచయిత బీవీఎస్ రవి ట్విట్టర్ లో “అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయo చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది,” అని ట్వీట్ చేసాడు. డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై సెటైర్ అని చాలా మంది అర్ధం చేసుకున్నారు.

అయితే దీనికి హరీష్ శంకర్, “అనుభవించమని ఇచ్చారా?” అని దణ్ణం ఎమోజీలను జత చేస్తూ రిప్లై ఇచ్చాడు. బీవీఎస్ రవి మళ్ళీ, “దయచేసి సెటైర్ ను ఎంజాయ్ చెయ్, గాడ్ బ్లెస్స్ యూ” అంటూ దానికి రిప్లై ఇచ్చాడు. అంతటితో ఆగకుండా హరీష్ శంకర్, “నువ్వు అది సెటైర్ అని వివరించావంటే, అది సెటైర్ కానట్లే లెక్క” అని ట్వీట్ చేసాడు.

దానికి మళ్ళీ రవి రిప్లై, ఇలా ఇద్దరి మధ్యా మాటల యుద్ధం సాగింది.


Advertisement

Recent Random Post:

Andhra Pradesh : చంద్రబాబు మొదటి 5 సంతకాల ఫైల్స్ కు ఆమోదం

Posted : June 24, 2024 at 3:09 pm IST by ManaTeluguMovies

Andhra Pradesh : చంద్రబాబు మొదటి 5 సంతకాల ఫైల్స్ కు ఆమోదం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement