Advertisement

RRR పై ఆలియా నెగిటివిటీ ఎఫెక్ట్ పడదు కదా..?

Posted : February 25, 2022 at 4:16 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు తన కెరీర్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ – ‘గంగూబాయి కతియావాడి’ వంటి ప్రతిష్టాత్మకమైన రెండు పెద్ద సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగూబాయి’ ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది.

‘గంగూబాయి’ సినిమాకు బాలీవుడ్ క్రిటిక్స్ నుంచి మంచి రేటింగ్స్ వస్తున్నాయి.. అలియా భట్ అద్భుతంగా నటించిందని విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే అమ్మడి చుట్టూ ఉన్న నెగిటివిటీ ఈ చిత్రంపై కూడా పడిందనేది స్పష్టంగా అర్థం అవుతోంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత అలియా భట్ ను నెపోటిజం పేరుతో బాగా ట్రోల్ చేసారు.

ఈ క్రమంలో అలియా నటించిన ‘సడక్ 2’ ట్రైలర్ డిస్ లైక్స్ తో ప్రపంచంలో చెత్త రికార్డ్ క్రియేట్ చేసేలా చేసారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం IMDBలో 1/10 రేటింగ్ పొందిందంటేనే ఆమెపియా నెగెటివిటీ ఆ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆలియా భట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పైనా ఈ నెగెటివిటీ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లే ఇప్పుడు ‘గంగూబాయి’ విషయంలో కూడా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఐఎండీబీలో ‘గంగూబాయి’ చిత్రానికి 3.7/10 రేటింగ్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం 3.9 గా ఉన్న రేటింగ్ ఇప్పుడు మరింత కిందికి వచ్చింది. సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే.. దీనిని బట్టి అలియా మీద ఇంకా వ్యతిరేఖత వ్యక్తం అవుతోందని తెలుస్తోంది. దీంతో త్వరలో రాబోయే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాపై ఈ ఎఫెక్ట్ పడుతుందేమో అని టాలీవుడ్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.

ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ కు జోడీగా సీత పాత్రలో ఆలియా భట్ కనిపించనుంది. అయితే ‘గంగూబాయి’ కు ఆడియన్స్ నుంచి వస్తోన్న ప్రతికూలత మరియు ద్వేషం.. ఇప్పుడు ఉత్తరాదిలో ‘ఆర్.ఆర్.ఆర్’ పై పడుతుందేమో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అదే సమయంలో జక్కన్న ఈ సినిమాతో అలియా భట్ పై నార్త్ ఫ్యాన్స్ లో ఉన్న ద్వేషాన్ని ప్రతికూలతను తొలగిస్తారని నమ్ముతున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే అలియాతో పాన్ ఇండియా సినిమాలు చెయ్యాలని టాలీవుడ్ స్టార్స్ ట్రై చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

Yudhra | Trailer 2 | Siddhant Chaturvedi | Raghav Juyal | Malavika Mohanan

Posted : September 11, 2024 at 5:48 pm IST by ManaTeluguMovies

Yudhra | Trailer 2 | Siddhant Chaturvedi | Raghav Juyal | Malavika Mohanan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad