శ్రీకాకుళం జిల్లాలో రైలు ఢీకొని పలువురు మరణించిన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలు తెలుసుకున్న సీఎం.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహాయసహకారాలు అందించాలని ఆదేశించారు. సోమవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం బాతువ వద్ద రైలు ఢీకొన్న ఘటనలో అయిదుగురు మరణించారు. ఘటనలో గాయపడిన వ్యక్తిని శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల్లో ఇద్దరు అసోంకు చెందిన వారు. మిగిలిన వారి సంగతి తెలియరాలేదు. గాయపడిన వ్యక్తి ఒడిశాలోని బ్రహ్మపుర ప్రాంతానికి చెందిన వారు. సోమవారం రాత్రి కోయంబత్తూర్ నుంచి సిల్ చెర్ వెళ్తున్న గౌహతి ఎక్స్ ప్రెస్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో కొంతమంది ప్రయాణికులు కిందకు దిగారు. దీంతో పక్కనే మరో ట్రాక్‌పై వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొట్టింది. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
శ్రీకాకుళం రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..
Advertisement
Recent Random Post:
అమెజాన్ అడవుల్లో అమెరికా అధ్యక్షుడు | US President to Visit Amazon Rainforest in Brazil
అమెజాన్ అడవుల్లో అమెరికా అధ్యక్షుడు | US President to Visit Amazon Rainforest in Brazil