Advertisement

‘విక్రమ్‌’ తో యూనివర్శిల్‌ స్టార్‌ కు పూర్వ వైభవం

Posted : May 6, 2022 at 11:32 am IST by ManaTeluguMovies

యూనివర్శిల్ స్టార్ కమల్‌ హాసన్‌ గత దశాబ్ద కాలంగా సరైన సక్సెస్ ను దక్కించుకోలేక పోయాడు అనడంలో సందేహం లేదు. ఆయన స్థాయి కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకోలేదు. కాని ఆయనకు ఉన్న స్టార్‌ డమ్ కారణంగా ప్రతి సినిమా కు కూడా మంచి బజ్‌ అయితే క్రియేట్‌ అవుతుంది. ఆ సినిమా విడుదల తర్వాత నిరాశ పర్చుతుంది. ఈసారి మాత్రం ఆయన ఖచ్చితంగా కమర్షియల్ గా బిగ్‌ హిట్‌ కొట్టబోతున్నాడు అనిపిస్తుంది. తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కమల్‌ తాజా చిత్రం ‘విక్రమ్‌’ బిగ్గెస్ట్‌ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు.

సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమాను దేశ వ్యాప్తంగా నాన్ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా ఏకంగా 125 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. స్టార్ ఇండియా ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. ఈ సినిమా లో కమల్‌ తో పాటు విజయ్ సేతుపతి మరియు ఫాహద్‌ ఫాజిల్ ఉండటంతో పాటు లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వం వహించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమా తో కమల్‌ కు పూర్వ వైభవం వస్తుందేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Kolkata Doctor Case: బెంగాల్లో ఏంజరుగుతోంది..? సీబీఐకి కేసు సవాలుగా మారిందా..?| Special Focus |

Posted : September 13, 2024 at 8:21 pm IST by ManaTeluguMovies

Kolkata Doctor Case: బెంగాల్లో ఏంజరుగుతోంది..? సీబీఐకి కేసు సవాలుగా మారిందా..?| Special Focus |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad