Advertisement

మరోసారి సూపర్ స్టార్ సరసన ఐశ్వర్య రాయ్!

Posted : June 7, 2022 at 6:55 pm IST by ManaTeluguMovies

సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తే చిత్రంతో మిశ్రమ స్పందన అందుకున్నాడు. ఈ సినిమా తమిళంలో యావరేజ్ గా ఆడగా, తెలుగులో ప్లాప్ గా నిలిచింది. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు రజినీకాంత్ నెక్స్ట్ సినిమా సన్నాహాలు మొదలయ్యాయి. బీస్ట్ తో తమిళంలో హిట్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ తన 169వ చిత్రం చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తున్నాయి.

ఈ సినిమాకు కథ స్వయంగా సూపర్ స్టార్ రజినీకాంత్ అందించాడు అన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. అంతే కాకుండా స్క్రీన్ ప్లే కు సహాయసహకారాలు అందించడానికి కెఎస్ రవికుమార్ ప్రాజెక్ట్ లో భాగమయ్యాడు. ఇక మరో సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ఎంపికైందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.


Advertisement

Recent Random Post:

CM YS Jagan Back To Back Punches on Chandrababu, Pawan Kalyan |

Posted : April 30, 2024 at 9:21 pm IST by ManaTeluguMovies

CM YS Jagan Back To Back Punches on Chandrababu, Pawan Kalyan |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement