Advertisement

అయోమయంలో అలియా.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో RRR పోస్ట్..!

Posted : March 29, 2022 at 12:22 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే సినిమా ప్రారంభంలో ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్న అలియా.. ఆ తర్వాత ఈ మూవీ విషయంలో వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో భాగం కావాలని ప్రతి ఒక్క యాక్టర్ కోరుకుంటారు. RRR రూపంలో అలాంటి అవకాశమే అలియాకు దక్కింది. ఇందులో ఆమె రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో కనిపించింది.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు ట్రిపుల్ ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే అలియా ఈ సినిమా సక్సెస్ గురించి సోషల్ మీడియాలో స్పందించకపోవడం.. ప్రమోషన్స్ లో ఎక్కువగా పాల్గొనకపోవడాన్ని తెలుగు మీడియా సంస్థలు ఎత్తి చూపాయి.

అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో రాజమౌళిని అన్ ఫాలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలానే RRR చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టులను ఇటీవల తొలగించింది. RRR షూటింగ్ ప్రారంభంలో రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోలను మాత్రమే ఉంచింది.

దీనికి కారణం ఏమయ్యుంటుందా అని నెట్టింట పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉంటూ వస్తోన్న అలియా భట్.. లేటెస్టుగా RRR సినిమా గురించి పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆశ్చర్యపరిచింది.

‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా మూడు రోజుల్లో 500 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని చెబుతూ మేకర్స్ సోమవారం ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తన గురించి నెట్టింట వినిపిస్తోన్న రూమర్స్ కు చెక్ పెట్టాలనుకుందో ఏమో తెలియదు కానీ.. ఇదే పోస్టర్ ను అలియా తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది.

అయినా సరే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలు సంబంధించి అలియా భట్ అయోమయంలో ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇందులో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందని.. ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని ప్రచారం చేయబడుతోంది.

కానీ రిలీజ్ కు ముందే కరోనా థర్డ్ వేవ్ పాండమిక్ తర్వాత అలియా ప్రమోషన్స్ లో కనిపించలేదు. దీనిని బట్టి సినిమాలో ఆమె పాత్ర నిడివి అలియా కోపానికి సంబంధం లేదు.. కానీ ఇంకేదో ఉందనే సందేహం కలుగుతోంది.

RRR సినిమా కోసం బాలీవుడ్ భామతో భారీగానే రెమ్యూనరేషన్ మాట్లాడుకున్నారనే టాక్ ఉంది. మరి ఇప్పుడు పేమెంట్స్ విషయంలో ఏదైనా సమస్య ఉందా అని కూడా పలువురు సందేహిస్తున్నారు. మరి అమ్మడు ఈ విధంగా వ్యవరించడానికి కారణమేంటి? ఆమెను నిజంగా కలవరపెట్టినది ఏమిటని అందరూ ఆలోచిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

నారా బ్రాహ్మణితో ముఖాముఖి | Nara Brahmani Interview | Election Campaign In Mangalagiri

Posted : April 22, 2024 at 12:46 pm IST by ManaTeluguMovies

నారా బ్రాహ్మణితో ముఖాముఖి | Nara Brahmani Interview | Election Campaign In Mangalagiri

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement