Advertisement

వివాదంలో అల్లరి నరేశ్‌ సినిమా

Posted : January 21, 2021 at 7:20 pm IST by ManaTeluguMovies

అల్లరి నరేశ్‌ హీరోగా నటించిన ‘ బంగారు బుల్లోడు’ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలపై స్వర్ణ కార సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వృత్తిని కించపరిచేలా చూపించిన కొన్ని సీన్లను సినిమాలోంచి తొలగించాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘాలు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు గురువారం స్వర్ణ కార సంఘాలు వినతి పత్రాలు అందజేశాయి. ఒకరి బంగారు ఆభరణాలను వేరొకరి వేడుకలకి స్వర్ణకారులు ఇవ్వరని.. అలా ఇస్తున్నట్టు ట్రైలర్‌లో చూపించి స్వర్ణకారులను కించపరిచారని ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ పేర్కొన్నారు.

స్వర్ణ కారులపై ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నా వెంటనే వాటిని తొలగించాలని తెలిపారు. అంతేకాకుండా రిలీజ్‌కు ముందు ప్రివ్యూ వేయాలని, లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని అడ్డుకుంటామని డిమాండ్‌ చేశారు. ఇక ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు గిరి పి దర్శకత్వం వహించారు. అల్లరి నరేశ్‌కు జోడీగా హీరోయిన్‌ పూజా జవేరీ నటించింది. ఈనెల 23న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.


Advertisement

Recent Random Post:

నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం: Pawan Kalyan Public Meeting at Railway Koduru | AP Elections 2024

Posted : April 25, 2024 at 10:06 pm IST by ManaTeluguMovies

నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం: Pawan Kalyan Public Meeting at Railway Koduru | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement