Advertisement

ఆహా క్వాలిటీ కంటెంట్‌ కోసం వారికి అల్లు అరవింద్‌ కాల్స్‌

Posted : April 30, 2020 at 10:27 pm IST by ManaTeluguMovies

గత రెండు నెలలుగా సినిమా థియేటర్లు మూత పడే ఉన్నాయి. మరో రెండు మూడు నెలల వరకు కూడా థియేటర్లు ఓపెన్‌ అవుతాయో లేదో తెలియని పరిస్థితి. థియేటర్లలో కరోనా వ్యాప్తి చాలా స్పీడ్‌గా జరిగే అవకాశం ఉందని థియేటర్లను ఓపెన్‌ చేయడం అనేది చివరి ఆప్షన్‌గా ప్రభుత్వాలు పెట్టుకున్నాయి. కనుక థియేటర్లపై ఆశలు వదిలేసిన ఫిల్మ్‌ మేకర్స్‌ ఓటీటీపై దృష్టి పెడుతున్నారు. ఇప్పటి వరకు తెలుగులో సరైన మంచి వెబ్‌ సిరీస్‌లు రాలేదు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు అల్లు అరవింద్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

అల్లు అరవింద్‌ ఆహా ఓటీటీని ప్రారంభించి చాలా నెలలు అయ్యింది. కాని ఇది ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. కారణం ఇప్పటి వరకు చిన్న చిన్న సినిమాలనే స్ట్రీమ్‌ చేయడంతో పాటు వెబ్‌ సిరీస్‌ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకుండా లో క్వాలిటీతో ఉన్నవాటిని స్ట్రీమ్‌ చేయడం వంటి కారణాల వల్ల ఆహాను పట్టించుకోవడం లేదు. ఆహాను జనాల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో క్వాలిటీ కంటెంట్‌ కోసం అల్లు అరవింద్‌ కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాడట.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ట్యాలెంటెడ్‌ డైరెక్టర్స్‌, ప్రముఖ దర్శకులకు అల్లు అరవింద్‌ స్వయంగా కాల్‌ చేసి వెబ్‌ సిరీస్‌ల కోసం మంచి కాన్సెప్ట్‌లు రెడీ చేయమన్నాడట. అలాగే చిన్న చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తానని, దాన్ని ఓటీటీలో స్ట్రీమ్‌ చేస్తామంటూ చెప్పి స్క్రిప్ట్‌ రెడీ చేసుకు రమ్మన్నాడట. పలువురు అందుకు ఒప్పుకోగా కొందరు మాత్రం పెద్ద హీరోలతో థియేటర్లలో పడే సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తామని అన్నారట. ఎట్టకేలకు అల్లు అరవింద్‌ వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టడంతో ఇప్పుడైనా క్వాలిటీ కంటెంట్‌ వస్తుందేమో చూడాలి. ఆహాలో క్వాలిటీ వెబ్‌ సిరీస్‌లు వస్తేనే అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

కర్నూలు జిల్లా పి.కోటకొండలో గ్రామస్తుల ఆందోళన.. | Kurnool

Posted : November 2, 2024 at 1:22 pm IST by ManaTeluguMovies

కర్నూలు జిల్లా పి.కోటకొండలో గ్రామస్తుల ఆందోళన.. | Kurnool

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad