దాదాపు గత రెండు నెలలుగా సినిమా థియేటర్లు మూత పడే ఉన్నాయి. దాంతో పాలన్ చేసిన రిలీజ్ డేట్స్ అన్నీ తారుమారయ్యాయి, అలాగే మరో రెండు మూడు నెలల వరకు కూడా థియేటర్లు ఓపెన్ అవుతాయనే పరిస్థితి కనిపించడం లేదు. మరో వైపు షూటింగ్స్ కి కూడా పర్మిషన్ లేదు. ఇటీవలే సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, షూటింగ్స్ కి సంబందించిన అప్డేట్ కోసం జులై వరకూ వైట్ చేయమన్నారు.
షూటింగ్స్ విషయంలో అల్లు అరవింద్ సరికొత్తగా ఓ ప్లాన్ వేశారు, కానీ అది సినిమా విషయంలో కాకుండా వెబ్ సీరిస్ ల కోసం అవ్వడంతో అందరినీ షాక్ చేస్తోంది. అల్లు అరవింద్ ఆహా ఓటీటీని ప్రారంభించి చాలా నెలలు అయ్యింది. కాని ఇది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దానికి కారణం ఇప్పటి వరకు చిన్న చిన్న సినిమాలనే స్ట్రీమ్ చేయడంతో పాటు వెబ్ సిరీస్‌ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోకుండా లో క్వాలిటీతో ఉన్నవాటిని స్ట్రీమ్ చేయడం వంటి కారణాల వల్ల ఆహాను పట్టించుకోవడం లేదు. ఆహాను జనాల్లోకి తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో క్వాలిటీ కంటెంట్ కోసం అల్లు అరవింద్ ట్యాలెంటెడ్ డైరెక్టర్స్, ప్రముఖ దర్శకులకు అల్లు అరవింద్ స్వయంగా కాల్ చేసి వెబ్ సిరీస్‌ల కోసం మంచి కాన్సెప్ట్‌లు రెడీ చేయమన్నారు. దీనికోసం కోట్లు ఖర్చు పెట్టి ఈ లాక్ డౌన్ లో కంటెంట్ ని సిద్ధం చేశారు.
కంటెంట్ రెడీ అవ్వడంతో అల్లు అరవింద్ ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అవ్వడమే కాకుండా ఓ చిన్న లొకేషన్ లో వె సీరీస్ షూటింగ్ చేసుకోవడం కోసం పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి లేక రాశారు. అందులో కేవలం 15 నుంచి 20 మందిలోపే షూటింగ్ స్పాట్ లో ఉంటారు. ఇది సినిమా కాదు వెబ్ సీరీస్ అవ్వడం వలన పర్మిషన్ ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. తక్కువ మందితో షూటింగ్ అనేది మంచిదే కానీ వెబ్ సీరీస్ అయినా క్వాలిటీ లేనిదే ఎవరూ చూడట్లేదు.. సో ఇంత తక్కువ మందితో షూటింగ్ చేయడం సాధ్యమేనా అనేది అందరి మదిలో ఉన్న మిలియన్ డాలర్ ప్రశ్న.