మొదటి నాలుగు రోజులు కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపిన పుష్ప ది రైజ్ ఇప్పుడు నెమ్మదించింది. ముఖ్యంగా ఏపీలో ఈ చిత్రానికి కష్టాలు తప్పట్లేదు. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో మొండిగా ఉంది. అంతే కాకుండా సరైన ప్రమాణాలు పాటించని థియేటర్లపై దాడులు నిర్వహిస్తూ, వాటిని సీజ్ చేస్తోంది. మరికొంత మంది థియేటర్ల ఓనర్లు ఆ టికెట్ రేట్లకు థియేటర్లను నిర్వహించలేక స్వచ్ఛందంగా మూసేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 100కు పైగా థియేటర్లు మూతబడ్డాయి.
ఇక రేపటి నుండి 83, శ్యామ్ సింగ రాయ్ చిత్రాల నుండి పుష్పకు పోటీ ఎదురవుతోంది. కలెక్షన్స్ బాగున్నా కానీ పుష్ప ఇంకా బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేదు. ఇన్ని ప్రతికూలతల మధ్య పుష్ప ఏపీలో విజయం సాధిస్తుందా అన్నది చూడాలి.
అయితే ఓవర్సీస్ లో మాత్రం పుష్ప అదరగొడుతోంది. 2 మిలియన్ డాలర్ మార్క్ కు అత్యంత చేరువగా వచ్చింది. ఈ వీకెండ్ కు ఆ మార్క్ ను క్రాస్ చేయడం ఖాయం.