Advertisement

నాకెందుకు ప్రపోజ్‌ చేయలేదంటూ బుంగ మూతి పెట్టుకున్న అనసూయ

Posted : April 4, 2021 at 8:06 pm IST by ManaTeluguMovies

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో కూడా స్టార్ అనడంలో సందేహం లేదు. ఆమె ఇన్‌ స్టా గ్రామ్‌ ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. రెగ్యులర్‌ గా హాట్‌ ఫొటోలు మరియు వీడియోలను షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అనసూయ నెట్టింట వచ్చే కామెంట్స్ కు కూడా ఘాటుగా సూటిగా సమాధానం చెబుతుంది. ఇక తాజాగా ఈమె షేర్‌ చేసిన రీల్ వీడియో వైరల్‌ అవుతోంది. ఒక లైలా కోసం సినిమాలో పూజా హెగ్డే చెప్పే డైలాగ్‌ ను ఈమె చాలా ముద్దుగా చెప్పింది.

సినిమాలో పూజా హెగ్డే స్నేహితులకు ఫోన్ చేసి నాకెందుకు ప్రపోజ్‌ చేయలేదు అందరి కంటే నేనే అందంగా ఉంటాను కదా అంటుంది. ఆ డైలాగ్‌ ను పూజా కంటే అనసూయ మరింత అందంగా క్యూట్‌ గా చెప్పిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా పూజా హెగ్డే చాలా క్యూట్‌ గా చెప్పిందని అంటున్నారు. నాకెందుకు ప్రపోజ్‌ చేయలేదు అంటూ ప్రశ్నించిన అనసూయకు నెటిజన్స్‌ ఎంతో మంది ఐలవ్‌ యూ అంటూ ప్రపోజ్‌ చేశారు. వాటికి అను ఎలా స్పందిస్తుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

జగన్ కు ఓటేసి గెలిపించాలి : Asaduddin Owaise Extends His Support For CM Jagan

Posted : May 2, 2024 at 12:14 pm IST by ManaTeluguMovies

జగన్ కు ఓటేసి గెలిపించాలి : Asaduddin Owaise Extends His Support For CM Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement