Advertisement

తలైవి : ఆయన కాకుంటే మరెవ్వరు లేరు!

Posted : September 12, 2021 at 3:51 pm IST by ManaTeluguMovies

సౌత్ ఆడియన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ‘తలైవి’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఐరన్ లేడీ జయలలిత బయోపిక్ గా వచ్చిన తలైవి సినిమా కు తమిళనాడులో మంచి స్పందన వస్తున్నట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అమ్మ పాత్రను పోషించిన తలైవి పూర్తి న్యాయం చేసిందని రివ్యూలు వస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకుంటున్న విషయం ఏంటీ అంటే కంగనా కంటే అరవింద్ స్వామికి ఎక్కువ మార్కులను తమిళ ఆడియన్స్ వేస్తున్నారు. చనిపోయిన ఎంజీఆర్ ను దించినట్లుగానే అరవింద్ రూపు మరియు బాడీ లాంగ్వేజ్ ఉందని.. ఆయన్ను సినిమాల్లో చూసిన వారు రాజకీయాల్లో ఎరిగిన వారు అంతా కూడా తలైవి సినిమాలో అరవింద్ స్వామిని కాకుండా ఎంజీఆర్ నే చూస్తున్నామని అంటున్నారు.

కొన్ని పాత్రలను కొందరు మాత్రమే వేయగలరు అని అంటూ ఉంటారు. అది నూటికి నూరు పాళ్లు నిజం అని తలైవి సినిమాలోని ఎంజీఆర్ పాత్రను చూస్తుంటే అనిపిస్తుందని.. ఆ పాత్రను తలైవిలో అరవింద్ స్వామి కాకుండా మరెవ్వరు వేసినా కూడా ఖచ్చితంగా సెట్ అవ్వలేక పోయేవారు. అమ్మ పాత్రను మరెవ్వరైనా వేసినా మెప్పించేవారేమో కాని ఆయన పాత్రను అరవింద్ స్వామి కాకుండా మరెవ్వరు వేసేందుకు లేరు అంటూ ఒక తమిళ నెటిజన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. అంతగా అరవింద్ స్వామి పాత్రలో లీనమై ఒదిగి పోయి జీవించాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా తలైవి సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను పరిశీలిస్తే ప్రధానంగా కంగనా మరియు అరవింద్ స్వామిలకు సంబంధించిన పాత్రలు మరియు వారి నటన గురించి మాట్లాడుకుంటున్నారు. వారు సినిమాలో ఉండటం వల్లే తలైవి కి వెళ్తున్నామని కొందరు అంటూ ఉంటే కొందరు వారిద్దరు తలైవికి రెండు కళ్లు మాదిరిగా ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి కంగనా రనౌత్ నటించిన తలైవి సినిమా మరోసారి అరవింద్ స్వామికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టింది. సినిమాలో ఎక్కడ కూడా అరవింద్ స్వామి కనిపించకుండా మొత్తం స్క్రీన్ పై చనిపోయిన ఎంజీఆర్ నే ప్రేక్షకులు చూశారు అంటే అది దర్శకుడి గొప్పతనం మరియు నటుడిగా అరవింద్ స్వామి డెడికేషన్. సరైన అవకాశం రావాలే కాని అరవింద్ స్వామి ప్రతి సందర్బంలో కూడా ది బెస్ట్ అనిపించుకుంటూ తన కు ఇచ్చిన పాత్రలో జీవిస్తూనే ఉంటాడు.


Advertisement

Recent Random Post:

Silver Sales Higher Than Gold : బంగారం కంటే వెండి కొనుగోళ్లే ఎక్కువ

Posted : November 1, 2024 at 1:15 pm IST by ManaTeluguMovies

Silver Sales Higher Than Gold : బంగారం కంటే వెండి కొనుగోళ్లే ఎక్కువ

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
Advertisement
728x90 Ad