జూమ్ లో చంద్రబాబు, ట్విట్టర్‌లో లోకేశ్.. రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కొడాలి నాని. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సీఎం జగన్ ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇంత త్వరగా అందించడం ఓ రికార్డని అన్నారు.
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు చేశారు. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అతి తక్కువ సమయంలో రైతులకు పరిహారం అందించిన ఘనత దేశంలో తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, రూ.3,600 కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు.
చంద్రబాబుకు అమరావతి, తమ సామాజికవర్గానికి లబ్ది తప్పితే మరేదీ అక్కర్లేదని ఆరోపించారు. డిసెంబర్ 25న రాష్ట్రంలోని 30 లక్షల ఇళ్ల స్థలాలను, సంక్రాంతికి ఎస్టీ,ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓబీసీ యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా 9,260 సబ్సిడీ వాహనాలను అందిస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు. పేదలకు ఇళ్లు ఇవ్వనీయకుండా 25కోట్లు ఖర్చు పెట్టి కోర్టుల ద్వారా స్టే తెచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు.