మెగాస్టార్ చిరంజీవి అనగానే 1980 యూత్‌కు గుర్తుకు వచ్చేది డాన్స్. 1980..90 ల్లో ఆయన డాన్స్ ఒక అద్బుతం. అప్పట్లో ఆయన డాన్స్‌కే సినిమాలు వందల రోజులు ఆడేవి. తెలుగు సినిమాకు కొత్త స్టెప్పులు నేర్పించింది చిరంజీవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. డిస్కో డాన్స్‌తో పాటు వీణ స్టెప్పు ఇలా ఏ రకంగా డాన్స్ వేసినా కూడా ప్రేక్షకులు నీరాజనాలు పట్టేవారు. ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రంలో వేసిన స్టెప్పులను ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు.
నేడు అంతర్జాతీయ డాన్స్ దినోత్సవం కావడంతో డాన్స్‌తో తనకున్న అనుబంధంను ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ వయసులో కూడా తాను అలసటగా అనిపించినప్పుడు లేదంటే మూడ్ సరిగా లేనప్పుడు డాన్స్ చేస్తాను. ఒక మంచి సంగీతంకు డాన్స్ చేస్తూ ఉంటే వెంటనే మనం రీఫ్రెష్ అవ్వొచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి కూడా మూడ్ ఆఫ్ లో ఉన్న సమయంలో డాన్స్ చేయమంటూ నేను సలహా ఇస్తానంటూ చిరంజీవి పేర్కొన్నారు.
ఈ వయసులో కూడా చిరంజీవికి ఉన్న డాన్స్ పై మమకారం చూస్తూ యువ హీరోలు ముక్కున వేలేసుకుంటున్నారు. తన సినిమాల్లోని కొన్ని డాన్స్ మూమెంట్స్ వీడియోను సాయంత్రంకు పోస్ట్ చేస్తానంటూ ఉదయం చిరంజీవి ప్రకటించారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందడంతో ఆ వీడియోను పోస్ట్ చేయడం లేదంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడు కాకున్నా రేపు ఎల్లుండి అయినా ఆ డాన్స్ వీడియో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. నిజంగా చిరంజీవి డాన్స్ పై ఇష్టంను అభినందించకుండా ఉండలేం.