కరోనా కారణంగా మూడు నెలల క్రితం మూత పడ్డ థియేటర్లు మరో మూడు నెలల తర్వాత అయినా తెరుచుకుంటాయో లేదో చెప్పలేని పరిస్థితి. అలాంటి నేపథ్యంలో భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదల విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే ప్రారంభం అయ్యి సగం షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఈ ఏడాదిలో థియేటర్లు ఓపెన్ అయితే విడుదల అయ్యే అవకాశం ఉంది. కాని కొత్తగా ప్రారంభం కావాల్సిన సినిమాలు మాత్రం ఇప్పట్లో ప్రారంభం కాకపోవచ్చు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అన్నట్లుగానే ప్రముఖ నిర్మాత దిల్‌రాజు షాకింగ్ ప్రకటన చేశాడు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దిల్‌రాజు ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆ సినిమాను పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమాను ప్రారంభించే అవకాశం ఇప్పట్లో లేదట. వచ్చే ఏడాది వరకు కొత్త సినిమాలను ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నాడట. కొత్త సినిమాలను ప్రారంభించడం అంటే రిస్క్ చేయడమే అనుకుంటున్నారు.
థియేటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి అనుకున్నప్పుడు మాత్రమే సినిమాల నిర్మాణంను మొదలు పెట్టాలనేది నిర్మాత దిల్ రాజు ప్లాన్‌గా తెలుస్తోంది. ఇప్పటికే పూర్తి అయిన ‘వి’ సినిమాను సగంకు ఎక్కువ పూర్తి అయిన ‘వకీల్ సాబ్’ సినిమాను మాత్రం ఈ విపత్తు కాలంలోనే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా అంటే పక్కా బిజినెస్ గా భావించే దిల్‌రాజు ఈ విపత్తు సమయంలో కొత్త సినిమాల నిర్మాణం వద్దనుకుంటూ సేఫ్ జోన్‌లో ఉంటున్నాడు