Advertisement

హరి హర వీరమల్లు డైరెక్టర్ ‘కన్యాశుల్కం’

Posted : December 27, 2021 at 10:32 pm IST by ManaTeluguMovies

విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న క్రిష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హరి హర వీరమల్లు సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు క్రిష్ తాజాగా కొండ పొలం సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. అతి త్వరలోనే క్రిష్ మళ్లీ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నాడు. ఇదే సమయంలో ఆయన నిర్మాతగా మరిన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆయన తాజాగా కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ ను మొదలు పెట్టబోతున్నాడు. ఆయనకు కన్యాశుల్కం అంటే చాలా ఇష్టం.

ఆ విషయాన్ని చాలా సార్లు చెప్పాడు. ఇదే విషయాన్ని ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చాడు. కన్యాశుల్కం వెబ్ సిరీస్‌ కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడు. సోనీ లివ్‌ కోసం వెబ్‌ సిరీస్ ను క్రిష్ నిర్మించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. హరి హర వీరమల్లు సినిమా తో పాటు కన్యాశుల్కం వెబ్‌ సిరీస్ ను కూడా ఒకే సారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. కన్యాశుల్కం వెబ్‌ సిరీస్ కు దర్శకుడు ఎవరు నటీ నటులు ఎవరు అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Advertisement

Recent Random Post:

నా చెల్లెలు గీతాంజలిని ట్రోల్‌ చేసి వేధించారు : CM Jagan

Posted : April 23, 2024 at 5:43 pm IST by ManaTeluguMovies

నా చెల్లెలు గీతాంజలిని ట్రోల్‌ చేసి వేధించారు : CM Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement