Advertisement

కలిసొచ్చిన డైరెక్టర్ తో ధనుష్ మూడవ సారి

Posted : January 26, 2022 at 12:17 pm IST by ManaTeluguMovies

కోలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు హీరో ధనుష్. తెలుగులోనూ మంచి పేరుతో పాటు ప్రేక్షకాభిమానుల్ని కూడా ఏర్పరచుకున్నారు. ఆయన సినిమా వస్తోందంటే తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలి వుంటు ఇప్పడు ధనుష్ హిందీ ప్రేక్షకులకు కూడా అభిమాన నటుడిగా మారిపోయాడు. 2013లో ధనుష్ బాలీవుడ్ తెరకు పరిచయం అయ్యారు.

ఆయన హీరోగా నటించిన తొలి హిందీ చిత్రం `రాంఝనా`. సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్ రూపొందించారు. విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం హీరోగా ధనుష్కు మంచి పేరు తెచ్చి పెట్టింది. బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ధనుష్ కు ఫిల్మఫేర్ అవార్డుతో పాటు ఇఫా పురస్కారం కూడా లభించింది. దీంతో దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ హీరో ధనుష్ కు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

ఆ అనుబంధం కారణంగా ఇటీవల `అత్రంగిరే` చిత్రంలో మరో అవకాశం ఇచ్చాడు. ధనుష్ తో కలిసి ఇందులో అక్షయ్ కుమార్ సారా అలీఖాన్ నటించారు. గత ఏడాది డిసెంబర్ 24న డిస్నీప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో ముచ్చటగా మూడవ బాలీవుడ్ మూవీని కూడా ధనుష్ మళ్లీ ఆనంద్ ఎల్. రాయ్ తో చేస్తున్నాడు. ఈ సారి యాక్షన్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీని ధనుష్ తో చేయబోతున్నారు ఆనంద్ ఎల్. రాయ్..

ఇప్పటి వరకు ఆనంద్ ఎల్. రాయ్ చేసిన రాంఝనా అత్రంగిరే చిత్రాల్లో ధనుష్ లవర్ బాయ్ గా కనిపించాడు కానీ తాజా చిత్రంలో మాత్రం యాక్షన్ అవతార్ లో సరికొత్త పాత్రలో ధనుష్ కనిపించనున్నాడట. ఇదొక ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానుందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయని తెలిసింది.

ధనుష్ ఈ ఏడాది తెలుగులో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయన తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం `సార్`. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళంలోనూ ఏక కాలంలో తెరకెక్కుతోంది. తమిళంలో `వాతి` అనే టైటిల్ ని ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ సినిమాస్ బ్యానర్ లపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

AP Assembly Session 2024 : ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన YS Jagan

Posted : June 21, 2024 at 12:43 pm IST by ManaTeluguMovies

AP Assembly Session 2024 : ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన YS Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement