Advertisement

కాలేజ్ డేస్ లో ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాను

Posted : November 7, 2021 at 11:51 am IST by ManaTeluguMovies

కార్తికేయ హీరోగా చేసిన ‘రాజా విక్రమార్క’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. ఈ వేదికపై హీరో కార్తికేయ మాట్లాడుతూ .. “ఈ సినిమాలో హీరోయిన్ గా తాన్య చేసింది. ‘శ్రీ’ నాకు కథ చెప్పినప్పుడు హీరోయిన్ గా క్లాసికల్ డాన్సర్ కావాలని అన్నాడు. తాన్య ప్రొఫైల్ చూడగానే ఈ అమ్మాయి అయితే బాగుంటుందని అంతా అనుకున్నాము. ‘శ్రీ’ వెళ్లి ఆమెను కలిశాడు .. ఆమె ఓకే చెప్పేసింది. ఆ తరువాత నాకు తెలిసింది .. ఆమె రవిచంద్రన్ గారి గ్రాండ్ డాటర్ అని. అప్పట్లో ఆయన తమిళంలో పెద్ద హీరో.

ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఆమె మమ్మల్ని ఎప్పుడూ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టలేదు. డేట్ల సమస్య వచ్చినా ఆమె ఎంతో సహకరించారు. అందుకు ఆమెకి థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక సాయికుమార్ గారి విషయానికి వస్తే ఈ జనరేషన్ హీరోలకు ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఈ సినిమాలో మళ్లీ ఆ నాలుగో సింహం కనిపించబోతోంది. ఇక నేను యాక్షన్ .. సెంటిమెంట్ చేస్తానుగానీ కామెడీ అంటే భయం. అలాంటి నాలో కాస్త కామెడీ టైమింగ్ ఉందని తెలిసింది హర్షవర్ధన్ వల్లనే. నా కామెడీ టైమింగ్ క్రెడిట్ ఆయన వలన దక్కిందిగానే భావిస్తాను.

‘గ్యాంగ్ లీడర్ ‘ .. ‘చావుకబురు చల్లగా’ సినిమాలతో మంచి పేరు వచ్చింది కానీ ‘ఆర్ ఎక్స్ 100’ వంటి కమర్షియల్ హిట్ మాత్రం రాలేదు. కానీ నేను ఏ సినిమా చేసినా నన్ను సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను జిమ్ కి వెళ్లినా .. డాన్స్ చేస్తున్నా .. ఫైట్స్ చేస్తున్నా నన్ను అభిమానించేవారిని దృష్టిలో పెట్టుకునే చేస్తాను. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంతవరకూ ఈ సినిమాతో అక్కడ కొట్టేద్దాం .. ఇక్కడ కొట్టేద్దాం అనుకుని ఏవేవో చేసేశా. ఇకపై అలా ఉండదు.

ఇక నుంచి నేను సెలెక్ట్ చేసుకునే ప్రతి స్క్రిప్ట్ మీరు గర్వపడేలా ఉంటుంది. ఈ విషయంలో నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను. నేను స్టార్ అవుతానా .. ఏమవుతానా అనేది తరువాత చూసుకుందాం. నవంబర్ 12వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఇక ఈ వేదికపై నేను ఒక ఎనౌన్స్ మెంట్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ఎంగేజ్ మెంట్ అయిందని మీకు తెలుసు. సాధారణంగా బీటెక్ లో అమ్మాయిల వెంటపడటం .. ఆ అమ్మాయి నెంబర్ పట్టుకుని మెసేజ్ లు పెట్టడం చేస్తుంటాం. అలా నేను మెసేజ్ లు పెట్టి ప్రపోజ్ చేసి .. ఫైనల్ ఇయర్లో ఒక అమ్మయితో ఓకే చెప్పించుకున్నాను.

ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నేను హీరోను అయిన తరువాత మీ ఇంట్లో వాళ్లను అడుగుతాను అని అప్పుడే చెప్పాను. అలాగే హీరోను అయ్యాను .. ఈ నెల 21వ తేదీన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. నా కాబోయే శ్రీమతిని ఒకసారి మీ అందరికీ పరిచయం చేస్తాను. అంటూ తన కాబోయే శ్రీమతి ‘లోహిత’ని ఈ వేదిక ద్వారా కార్తికేయ పరిచయం చేశాడు.


Advertisement

Recent Random Post:

Jabardasth Latest Promo – 22nd & 23rd November 2024 – Every Friday & Saturday @9:30 PM – #EtvTelugu

Posted : November 21, 2024 at 1:02 pm IST by ManaTeluguMovies

Jabardasth Latest Promo – 22nd & 23rd November 2024 – Every Friday & Saturday @9:30 PM – #EtvTelugu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad