Advertisement

10 కోట్ల మార్క్ ను టచ్ చేస్తోన్న ఉస్తాద్ రామ్

Posted : June 9, 2021 at 9:08 pm IST by ManaTeluguMovies

ఎనర్జిటిక్ స్టార్ ట్యాగ్ నుండి ఉస్తాద్ గా మారాడు రామ్ పోతినేని. దీంతో పాటే తన రెమ్యునరేషన్ కూడా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 6-7 కోట్ల మధ్య ఉన్న రామ్ రెమ్యునరేషన్ ఇప్పుడు 10 కోట్ల మార్క్ ను టచ్ అయిందని తెలుస్తోంది.

అయితే ఈ పారితోషికం తెలుగు-తమిళ భాషల్లో రూపొందుతోన్న లింగుసామి చిత్రం కోసం. ఈ సినిమాను రెండు భాషల్లో విడుదల చేయడమే కాకుండా మరిన్ని భాషల్లోకి డబ్ కూడా చేసే ఆలోచన ఉంది. రామ్ హిందీ డబ్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. అతని సినిమాలకు కోట్లల్లో వ్యూస్ వస్తాయి.

ఈ ఫ్యాక్టర్స్ ను దృష్టిలో పెట్టుకుని రామ్ తన పారితోషికాన్ని హైక్ చేసాడని సమాచారం. లింగుసామి తో చేసే చిత్రంలో ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఏఆర్ మురుగదాస్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు మన ఉస్తాద్ రామ్.


Advertisement

Recent Random Post:

Actor Sivaji Aggressive Comments on YS Jagan | AP Elections 2024

Posted : May 7, 2024 at 10:07 pm IST by ManaTeluguMovies

Actor Sivaji Aggressive Comments on YS Jagan | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement